calender_icon.png 5 May, 2025 | 10:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మౌలిక వసతులు మెరుగుపరిచేందుకు కృషి : ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్

24-04-2025 12:53:41 AM

కూకట్ పల్లి ఏప్రిల్ 23 (విజయక్రాంతి): బస్తీలు, కాలనీల్లో మౌలిక వసతులు మెరుగుపరిచేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ అరికెపూడి గాంధీ అన్నారు. నియోజకవర్గం పరిధిలోని ధీనబంధుకాలనీలో సుమారు రూ.30 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణం పనులకు బుధవారం ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి శంకుస్థాపన చేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రజా సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందన్నారు. నియోజకవర్గాన్ని అన్నిరంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామన్నారు. బస్తీలు, కాలనీల్లో మౌలిక వసతులు కల్పించేందుకు అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు తెలిపారు.

అభివృద్ధి పనుల్లో ఎక్కడ రాజీ పడకుండా నాణ్యత ప్రమాణాలతో సకాలంలో పూర్తయ్యేలా శ్రద్ధ తీసుకుంటున్నట్లు గాంధీ చెప్పారు. ఈ కార్యక్రమంలో కూకట్ పల్లి డివిజన్ కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ, డివిజన్ అధ్యక్షు డు లక్ష్మీనారాయణ, కాలనీ అధ్యక్షుడు ఎం.మహేందర్ నాయక్, నాయినేని  చంద్రకాంత్ రావు, సంజీవరెడ్డి, వెంకటేశ్వరశెట్టి, దత్తులూరి అశోక్, వార్డ్ మెంబర్ వెంకటయ్య, మహేష్, ఇబ్రహీం, సత్తిరెడ్డి, అనిల్, లక్ష్మయ్య, పెద్దసంఖ్యలో కాలనీవాసులు పాల్గొన్నారు.