24-04-2025 12:56:32 AM
రాజేంద్రనగర్, ఏప్రిల్ 23 : మెగా జాబ్ ఫెయిర్ కు అపూ ర్వ స్పందన లభించింది. ప్రముఖ సామాజికవేత్త సిద్దు రెడ్డి కందకట్ల ఆధ్వర్యంలో బుధవారం శంషాబాద్ పట్టణంలోని రాజ్ మహల్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి శంషాబాద్ పట్టణం తో పాటు వివిధ ప్రాంతాల నుంచి సు మారు 5000 మంది యువతీయువకులు తరలి వచ్చారు.
రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఈ కార్యక్రమానికి ము ఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. గూగుల్, అమెజాన్ వంటి ఐటీ కంపెనీలతోపాటు ఇతర కంపెనీలు భారీగా పాల్గొన్నాయి. ఇందులో భాగంగా అభ్యర్థుల విద్యా అర్హతలు పరిశీలించి సుమారు 500 మంది కంటే ఎక్కువ అభ్యర్థులకు అక్కడికక్కడే ఆఫర్ లెటర్లు అందజేశారు.
అనంతరం ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ.. యువత అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేస్తున్న సామాజికవేత్త సిద్దు రెడ్డి కందకట్ల అంద రికీ ఆదర్శప్రాయుడని కొనియాడారు. ఆయన మరింత ఉత్సాహంగా సేవ చేయాలని ఆకాంక్షించారు. అనంతరం సిద్దు రెడ్డి కందకట్ల మాట్లాడుతూ.. సమాజం కోసం తాను పరితపిస్తుంటానని, యువతకు తన వంతు సాయం చేసేందుకు మెగా జాబ్ మేళా నిర్వహించినట్లు తెలియజేశారు.
ఎన్నో ప్రముఖ కంపెనీలతో మాట్లాడి వారిని ఇక్కడికి తీసుకొచ్చి యువతకు ఉద్యోగాలు ఇప్పించినట్లు తెలియజేశారు. తాము ఊహించిన కంటే ఎక్కువ మంది యువత ఈ కార్యక్రమానికి హాజరు కావడం సంతోషంగా ఉందని సిద్దు రెడ్డికి కందకట్ల సంతోషం వ్యక్తం చేశారు. మున్ముందు ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహిస్తామని తెలియజేశారు.