ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ తప్పనిసరి..
జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్..
సూర్యాపేట (విజయక్రాంతి): ప్రభుత్వ ఉద్యోగులందరికీ పదవీ విరమణ తప్పనిసరి అని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్(District Collector Tejas Nandalal Power) అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో హౌసింగ్ పీడీ ధర్మారెడ్డి పదవీ విరమణ సందర్భంగా పూలమాలలు వేసి శాలువాతో సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వ సూచనలు అనుసరిస్తూ ప్రజల నుండి స్వీకరించిన ఇందిరమ్మ ఇండ్ల అర్జీలను హౌసింగ్ ఏఈల ద్వారా క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు ఏఈలకు ముందుగా శిక్షణ ఇచ్చి తదుపరి క్షేత్రస్థాయి పరిశీలించేందుకు పీడీ ఎంతగానో కృషి చేశారని తెలిపారు. 1983 నుండి 2025 వరకు 42 సంవత్సరాల పాటు హౌసింగ్ శాఖలో వివిధ పనిచేస్తూ ఉన్నత స్థాయికి చేరుకున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో డిటిడిఓ శంకర్, హౌసింగ్ డీఈ జబ్బార్, హౌసింగ్ ఏఈ లు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.






