25 March, 2026 | 2:04 PM

Breaking News

కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా.. రేవంత్ రెడ్డిపై జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు   •   పెన్షన్ వ్యాలిడిషన్ చట్టాన్ని రద్దు చేయాలంటూ పెన్షనర్స్ నిరసన   •   పెట్రోల్ బంకుల్లో బారులు తీరిన జనం.!   •   సోమశిల ఆలయంలో అపశృతి   •   భట్టి విక్రమార్కను కలిసిన కేటీఆర్.. నేతన్నల కష్టాలపై వినతి పత్రం   •   ఉత్సవాల ఏర్పాట్లలో వేగం పెంచాలి : జిల్లా కలెక్టర్ అంకిత్   •   ఉపాధి హామీ జమా ఖర్చులు అస్తవ్యస్తం   •   ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో బీఎస్పీ ఇన్‌చార్జ్‌ల నియామకం   •   బడంగ్‌పేట్ అధికారుల తీరుపై రామిడి రాంరెడ్డి ఆగ్రహం   •   అందుకే కాంగ్రెస్ పార్టీని వీడుతున్నా: జీవన్ రెడ్డి   •  

రేవంత్‌రెడ్డి ..ఛాంపియన్ ఆఫ్ తెలంగాణ ఫార్మర్

18-06-2025 12:00 AM

హైదరాబాద్, జూన్ 17 (విజయక్రాంతి) : రైతు భరోసాపై సీఎం రేవంత్‌రెడ్డి గొప్ప నిర్ణయం తీసుకున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. రైతులకు రైతు భరోసాతో ఆదుకున్న సీఎం రేవంత్‌రెడ్డి ఛాంపియన్ ఆఫ్ తెలంగాణ ఫార్మర్ అయ్యారని ఆయన తెలిపారు. మంగళవారం ఆయన  సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటీ వరకు చరణ్‌సింగ్‌ను ఛాంపియన్ ఆఫ్‌ది ఫార్మర్ అంటారని తెలిపారు.

కేవలంల 9 రోజుల్లోనే రూ. 9 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేయడమంటే సాహసోపేతమైన నిర్ణయమని, సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ చర్యలన్నారు. గత ప్రభుత్వం రూ. లక్ష రుణమాఫీ కూడా సరిగా చేయలేదని, కేసీఆర్ చేసిన రుణమాఫీ వడ్డీలకే సరిపోయిందని విమర్శించారు. కేసీఆర్ రైతులకు బేడీలు వేస్తే.. రేవంత్‌రెడ్డి రైతులకు అండగా ఉంటున్నారని తెలిపారు.