6 May, 2026 | 5:12 AM

రైతుల దెబ్బకు దిగివచ్చిన రేవంత్ రెడ్డి

28-11-2024 02:12 AM

మాజీ మంత్రి కేటీఆర్

హైదరాబాద్, నవంబర్ 27 (విజయక్రాంతి): దిలువార్‌పూర్‌లో రైతుల దెబ్బకు సీఎం రేవంత్‌రెడ్డి దిగొచ్చారని, లగచర్లలో కూడా లెంపలేసుకోవాలని బీఆర్‌ఎస్ వర్కిం గ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్‌లో పోస్టు చేశారు. లగచర్లలో.. అల్లుడి కోసం.. ఆదానీ కోసం..

ఇండస్ట్రియల్  కారిడార్ ముసుగులో పెడుతున్న ఫార్మా, సిమెంట్ ఫ్యాక్టరీల ప్రతిపాదనలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. గిరిజనుల భూములను దొంగచాటుగా, బలవంతంగా లాక్కునే కుట్రలకు తెరదించి శాంతిని నెలకొల్పాలని కేటీఆర్ పేర్కొన్నారు.