మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతిపట్ల రేవంత్ రెడ్డి సంతాపం
22-04-2026 01:18 PM
హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు(Nadendla Bhaskara Rao) మృతిపట్ల తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. శాసనసభ్యుడిగా, మంత్రిగా, ఎంపీగా సుదీర్ఘ రాజకీయ జీవితంలో వారి అనేక ప్రజాహిత కార్యక్రమాల్లో పాల్గొన్నారని గుర్తుచేసుకున్నారు. ఈ దుఃఖ సమయంలో వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలని, భాస్కరరావు ఆత్మకు శాంతి చేకూరాలని రేవంత్ రెడ్డి భగవంతుడిని ప్రార్థించారు. వారి మరణంపట్ల ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వృద్ధాప్య సమస్యల కారణంగా మాజీ సీఎం కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 90 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు.






