22 April, 2026 | 2:24 PM

Breaking News

మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతిపట్ల రేవంత్ రెడ్డి సంతాపం   •   ఆర్టీసీ సమ్మె వేళ... ప్రయాణికులకు మెట్రో గుడ్ న్యూస్   •   ఉప్పల్ బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులతో తీన్మార్ మల్లన్న ధర్నా   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత   •   కాళేశ్వరంపై నిందలు వేసి... కేసీఆర్ ప్రతిష్ట దెబ్బతీసేందుకు కుట్ర   •   కట్టుదిట్టమైన పర్యవేక్షణతో నాణ్యమైన రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి   •   ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   గంజి చంద్రమౌళి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు   •   రేవంత్ రెడ్డి నిజస్వరూపం... హైకోర్టు తీర్పుతో తేటతెల్లం   •   పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి   •  

మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత

22-04-2026 12:49 PM

హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు (Former CM Nadendla Bhaskara Rao Passes Away) కన్నుమూశారు. ఆయన వయసు 90 సంవత్సరాలు. వృద్ధాప్య సమస్యలతో  హైదరాబాద్ లోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నాదెండ్ల భాస్కరరావు తుది శ్వాస విడిచారు. నాదెండ్ల భాస్కరరావు 1935 జూన్ 23న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరులో జన్మించారు.

ఉస్మానియా విశ్వవిద్యాలయంనుంచి లా చదివారు. నాదెండ్ల భాస్కరరావు 1978లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1984లో నెల రోజులపాటు ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఎన్టీఆర్, మర్రిచెన్నారెడ్డి, అంజయ్య హయాంలో భాస్కర్ రావు మంత్రిగా పనిచేశారు. 1998లో భాస్కర్రావు ఖమ్మం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ భాస్కర్ రావు కుమారుడు. భాస్కరరావు మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు.