2 July, 2026 | 10:53 AM

Breaking News

సవాళ్లు, ప్రతిసవాళ్లు.. చర్చకు సిద్ధమైన మంత్రులు   •   భారీ వర్షానికి పశు వైద్య కార్యాలయ ప్రాంగణం జలమయం   •   డీ- అడిక్షన్ సెంటర్‌లో జిమ్ ట్రైనర్ ఆత్మహత్య   •   కరస్‌గుత్తిలో భూ రీ-సర్వే, సర్-2026 పనులను పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్   •   ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించాలి- జిల్లా కలెక్టర్   •   ఆటో బోల్తాపడి 10 మందికి తీవ్రగాయాలు   •   కాంట్రాక్ట్ పనులను పంచాయతీ సిబ్బందితో చేయించడం తగదు   •   పిచ్చికుక్క వీరంగం.. 10 మందికి తీవ్రగాయాలు.!   •   సిర్గాపూర్ పీహెచ్‌సీని సందర్శించిన డీఎంహెచ్‌వో   •   నకిలీ అక్రెడిటేషన్ కార్డు విషయమై పోలీసులకు ఫిర్యాదు   •  

హిందువులంటే రేవంత్ రెడ్డికి ద్వేషం

23-10-2024 02:26 AM

ఎంపీ ఈటల రాజేందర్

హైదరాబాద్, అక్టోబర్ 22 (విజయక్రాంతి): హిందువులంటే సీఎం రేవంత్ రెడ్డికి ద్వేషమని  ఎంపీ ఈటల రాజేందర్ ఆరోపించారు. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ హిందుత్వ వ్యతిరేకతతో పనిచేస్తోందని విమర్శించా రు. కాంగ్రెస్ ఏనాడు కూడా మత విద్వేషాలు సృష్టించే వారిని నియంత్రించలేదన్నారు. మంగళవారం  బీజే పీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మతోన్మాదులకు షెల్టర్ ఇస్తూ వారిని పోషిస్తు న్నదన్నారు. 

మోదీ ప్రధాని అయ్యాక మతకలహాలపై ఉక్కుపాదం మోపారన్నారు. దాడులకు వ్యతిరేకంగా శాంతి యుతంగా నిరసన తెలిపిన  బీజేపీ నాయకులను అరెస్టు చేయడం దు ర్మార్గమన్నారు. వెంటనే వారిని విడుదల చేసి కేసులను ఉపసంహరించు కోవాలని డిమాండ్ చేశారు. బీజేపీ  నేతలను వేధిస్తే సహించేది లేదన్నా రు.తెలంగాణలో స్లీపర్‌సెల్స్ ఉన్నాయని, టెర్రిస్టులకు అడ్డాగా మారింద ని కేంద్ర ఏజెన్సీలు హెచ్చరించినా రాష్ట్రం  పట్టించుకోవడం లేదన్నారు.