18 April, 2026 | 3:55 PM

Breaking News

మైనార్టీ గురుకుల ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలి   •   ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్రం గుడ్‌న్యూస్‌... DA పెంపు   •   హార్ముజ్ జలసంధి మళ్లీ బంద్‌ — ట్రంప్‌కు దిమ్మతిరిగే షాక్— ఇరాన్ సంచలన ప్రకటన   •   రాత్రి 8:30 గంటలకు జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం   •   మహిళా బిల్లు వీగిపోవడం— బీజేపీ విధానాల ఓటమి   •   దేశ మహిళలకు అన్యాయం.. కాంగ్రెస్, బీజేపీ‎ల‎పై హరీశ్‎రావు కీలక వ్యాఖ్యలు   •   వర్క్ షాప్ కోసం అనుమతి ఇవ్వండి   •   కరీంనగర్ లో విజయక్రాంతి వార్షికోత్సవ వేడుకలు   •   రాఘవపేటలో బడిబాట కార్యక్రమం   •   దళిత క్రిస్టియన్స్ పై సుప్రీంకోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలి   •  

తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు రైతులకు ఇచ్చిన ఘనత రేవంత్‌రెడ్డిది

27-06-2025 02:17 AM

రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి                    

సూర్యాపేట, జూన్ 26 (విజయక్రాంతి) : పదేండ్ల పాలనలో వేలకోట్లు సంపాదించిన ఘనత కేవలం బి.ఆర్.ఎస్ నాయకులకే దక్కిందని రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో విలేకరులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. లక్ష కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి కాలేశ్వరం పేరిట కూలీశ్వరం ప్రాజెక్టు కట్టారనీ విమర్శించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత 18 నెలల కాలంలో రైతుల సంక్షేమం కోసం లక్ష కోట్ల రూపాయల ఖర్చు చేశారన్నారు. 9 రోజుల్లో 9 వేల కోట్ల రూపాయల రైతు భరోసా నిధులను  రైతుల ఖాతాలో జమ చేసి రైతుల మనసులో చెరగని ముద్ర వేశారన్నారు. గతంలో జగన్ కు అత్యంత సన్నిహితంగా ఉంటూ ఆంధ్రకు మేలు చేసే విధంగా కేసీఆర్ వ్యవహరిస్తూ కృష్ణ, గోదావరి జలాలను ఆంధ్రకు అప్పగించారన్నారు.

నాడు మంత్రి అయిన జగదీశ్  రెడ్డి వందల కోట్లు అక్రమంగా సంపాదించారని, శంషాబాద్ సమీపంలో 90 ఎకరాలలో గెస్ట్ హౌస్ నిర్మాణం చేసుకున్నారని విమర్శించారు. ఇప్పటికైనా బిఆర్‌ఎస్ నాయకులు తప్పుడు ప్రచారం మానుకోవాలన్నారు.  పభుత్వం అమలు చేస్తున్న పథకాలతో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. ఈ సమావేశంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.