27-06-2025 02:16:14 AM
- మాదక ద్రవ్యాల నియంత్రణ ప్రతి పౌరుడు బాధ్యత
- ప్రిన్సిపల్ డిస్ట్రికట్స్ అండ్ సెషన్స్ జడ్జి బి.పాపి రెడ్డి, జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి, ఎస్పీ డి జానకి
మహాబూబ్ నగర్ జూన్ 26 (విజయ క్రాంతి) : మాదకద్రవ్యాలను నిర్మూలించేందుకుగాను జిల్లా యంత్రాంగానికి పూర్తి సహకారం అందించాలని ప్రిన్సిపల్ డిస్ట్రికట్స్ అండ్ సెషన్స్ జడ్జి బి.పాపి రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్య దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం ర్యాలీ నిర్వహణ గురువారం మహబూబ్ నగర్‌జిల్లా కేంద్రం లో మహిళా,శిశు సంక్షేమ శాఖ,జిల్లా న్యాయ సేవాధికార సంస్థ,పోలీస్ శాఖ లు స్టేడియం గ్రౌండ్ నుండి తెలంగాణా చౌరస్తా వరకు నిర్వహించిన అంతర్జాతీయ మాదక ద్రవ్య దుర్వినియోగం,అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం 2025 ర్యాలీని స్టేడియం గ్రౌండ్ వద్ద ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి బి.పాపి రెడ్డి,జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి ,ఎస్.పి.డి.జానకి లు జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాశాలల్లో విద్యార్థులు, యువత డ్రగ్స్ బారిన పడకుండా డ్రగ్స్ వలన కలిగే దుష్ప్రభావాలను వారికి అవగాహన కలిగించాలని అన్నారు.సమాజంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా డ్రగ్స్ వినియోగం అరికట్టేందుకు పోలీస్,జిల్లా యంత్రాంగానికి సహకారం అందించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో డీఎస్పీ వేంకటేశ్వర్లు,మహిళా,శిశు సంక్షేమ శాఖ అధికారిణి జరీనా బేగం,జిల్లా న్యాయ సేవాధికర సంస్థ కార్యదర్శి ఇందిర,జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.కె.కృష్ణ డిపిఆర్‌ఓ శ్రీనివాస్,ఎల్.డి.ఎం.భాస్కర్, జిల్లా విద్యాశాఖ అధికారి ప్రవీణ్ కుమార్, ఏ.ఎం. ఓ డి.శ్రీనివాస్, రెడ్ క్రాస్ సంస్థ చైర్మన్ నటరాజ్,సీనియర్ సిటిజన్ పొరం నాగభూషణం, జగపతి రావు తదితరులు పాల్గొన్నారు.