రేవంత్‌రెడ్డి మా సభా నాయకుడు
- సీఎంపై బీఆర్‌ఎస్ అనేక కుట్రలు, కుతంత్రాలు చేస్తోంది
- చిన్నారెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, కొండా సురేఖ.. ఎవరైనా విమర్శలు చేస్తే సహించబోం
- వీరిపై చర్యలు తీసుకోవాల్సిందే..
- కొండా సురేఖ వివరణ సరిగాలేదు
- కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, విజయరమణా రావు, రామచంద్రనాయక్
హైదరాబాద్, ఆగస్టు 22 (విజయక్రాంతి): సీఎం రేవంత్‌రెడ్డి తమ సభా నాయకుడని, తామంతా ముఖ్యమంత్రి కి అండగా ఉంటామని ప్రభుత్వ విప్‌లు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, విజయరమణారావు, రామచంద్ర నాయక్, నవీన్ యాదవ్ పేర్కొన్నారు. సీఎం రేవం త్‌రెడ్డిపై బీఆర్‌ఎస్ అనేక కుట్రలు, కుతంత్రాలు చేస్తోందని, వాటిని నిరంతరం తిప్పికొడతామని స్పష్టం చేశారు. చి న్నారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, కొండా సురేఖ..
ఎవరైనా సరే సీఎంపై విమర్శలు చేస్తే సహించబోమని, వీరిపై తప్పకుండా క్రమశిక్షణా చర్యలు తీసుకోవా ల్సిందేనని తేల్చి చెప్పారు. రేవంత్ రెడ్డిని చూసి బీఆర్‌ఎస్ నాయ కులు ఉలిక్కిపడుతున్నారని విమర్శించారు. ‘మా టీం 66 మంది, మా నాయకుడు రాహుల్ గాంధీ, మా నేత రేవంత్‌రెడ్డి. మాది కాంగ్రెస్ టీమ్’ అన్నారు. శనివారం సీఎల్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడి యా సమావేశంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాట్లాడారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ..
బీఆర్‌ఎస్ సొంత డబ్బా పత్రికల్లో ఇష్టానుసారంగా రాసుకున్నారని, బలహీన పార్టీ బీఆర్‌ఎస్ అన్నారు. మాజీమంత్రి చిన్నారెడ్డి ఎమ్మెల్యే.. మేఘారెడ్డిపై చేసిన వ్యాఖ్యలు తప్పు అన్నారు. చిన్నారెడ్డి ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ హోదాలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కూడా పాల్గొంటారని, తమ సీఎం నాయకులందరినీ బలోపేతం చేస్తున్నారని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి, ఆయన సోదరులపై కొండా సురేఖ కూతురు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
కొండా సుస్మితకు కాంగ్రెస్‌లో సభ్యత్వం కూడా లేదని, గతంలో కూడా సుస్మిత ముఖ్యమంత్రిపై ఇదే విధంగా విమర్శలు చేశారని గుర్తుచేశారు. అయినా రేవంత్‌రెడ్డి పెద్ద మనసుతో క్షమించారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి కొండా సురేఖ, కొండా మురళీ వెళ్లి క్షమించమని కోరారన్నారు.
క్రమశిక్షణా సంఘం ఇచ్చిన నోటీసుకు కొండా సురేఖ ఇచ్చిన వివరణ సరిగా లేదన్నారు. తన కూతురు చేసిన వ్యాఖ్యలు తప్పని ఆమె ఒప్పు కుంటే వివాదం ముగిసేదన్నారు. పార్టీ వ్యతిరేక చర్యలపై క్రమశిక్షణా సంఘం, అధిష్ఠానం కఠిన చర్యలు తీసుకోవాల్సిందే అన్నారు. నిన్న జరిగినది సీఎల్పీ సమావేశం కాదని, కేవలం మీడియా సమావేశం మాత్రమే అన్నారు. తాము బలప్రదర్శన చేయాల్సి వస్తే కేసీఆర్‌తో ఒక్క ఎమ్మెల్యే కూడా మిగలడని, ఇప్పటికే పది మంది బయటకు వచ్చారన్నారు.
కొండా సురేఖ క్షమాపణ చెప్పాలి: విజయరమణారావు
క్రమశిక్షణను ఉల్లంఘించి కొంతమంది ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని విజయరమణారావు పేర్కొ న్నారు. పదేళ్ల కేసీఆర్ రాక్షస పాలనపై కాంగ్రెస్ కార్యకర్తలు, రేవంత్‌రెడ్డి అలుపెరగని పోరాటం చేసి ప్రభుత్వాన్ని తీసుకువచ్చార న్నారు. అప్పుల పాలైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి రేవంత్‌రెడ్డి 18 గంటలు పనిచేస్తున్నారని తెలిపారు. పదవులు అనుభవిస్తున్న ఒకరిద్దరు పార్టీని, ప్రభు త్వాన్ని అప్రతిష్ఠపాలు చేస్తూ స్వార్థపూరితంగా మాట్లాడుతున్నారని చెప్పారు.
మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మిత వ్యాఖ్యలపై ఆమె ఇప్పటివరకు స్పందించలేదన్నారు. తన కూతురుతో తనకు సంబంధం లేదని సురేఖ బుకాయింపు మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సీనియర్ నాయకురాలైన కొండా సురేఖను సీఎం రేవంత్‌రెడ్డి తన సోదరిలా చూశారన్నారు. ముఖ్యమంత్రికి, పార్టీకి ఆమె బేషరతుగా క్షమాపణ చెప్పాలని, కూతు రితో కూడా క్షమాపణ చెప్పించాలని డిమాండ్ చేశారు. మంత్రి పదవి నుంచి తొలగించాలా లేదా అన్నది పార్టీ పెద్దలు నిర్ణయిస్తారని తెలిపారు.
సీఎంపై విమర్శలు సరికాదు: రామచంద్రనాయక్
కొండా సురేఖ కూతురు సీఎం రేవంత్‌రెడ్డిపై విమర్శలు చేయడం సరైనది కాదని రామచంద్రనాయక్ అన్నా రు. కార్య కర్తలను ఉత్తేజపర్చ డం కోసమే పరకాలలో సిట్టింగ్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి గురించి సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడా రని, సీఎం మాట్లాడిన దాంట్లో తప్పు ఏముందన్నారు. కొండా సుస్మిత ఏనాడైనా ప్రజాక్షేత్రంలో ఉన్నారా? ప్రజల కోసం పనిచేశారా? అని ప్రశ్నిం చారు. ఆమె భాష సరైనది కాదన్నారు. తన కూతురు మాటలను ఖండించాల్సిన సురేఖ ఎందుకు స్పందించలేదని, ఆమెపై యాక్షన్ తీసుకోవాల్సిం దేనని చెప్పారు.
ఆమె తీరుతో తప్పుడు సంకేతాలు: ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్
వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మాదిరిగా రేవంత్‌రెడ్డి కొండా సురేఖకు మంత్రి పదవి ఇచ్చారని ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ అన్నారు. కొండా సురేఖ తీరుపై కాంగ్రెస్ కార్యకర్తల్లో తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయన్నారు. ప్రతిపక్షాలను కట్టడి చేయాల్సిందిపోయి పార్టీని, ప్రభుత్వాన్ని ఇబ్బం ది పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కొండా సురేఖ రాజకీయ జీవితం దెబ్బతినేలా సుస్మిత వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. వయసులో మీ తండ్రి కంటే పెద్ద అయిన వ్యక్తిని డైపర్లు వేసుకుని తిరుగుతున్నారని మాట్లాడటం తప్పు అన్నారు.
బీసీల గౌరవం మంటకలిపేలా ఆమె తీరు ఉందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డికి క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. సీనియర్ నేత చిన్నారెడ్డి లాంటి వారు కూడా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటం మంచిది కాదన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎప్పుడు ఏం మాట్లాడుతారో ఆయనకే తెలియదన్నారు.
రేవంత్‌రెడిని బలహీన పరచాలనే..ఎమ్మెల్యే నవీన్ యాదవ్
పీసీసీ అధ్యక్షుడిగా, సీనియర్లందరినీ కలుపుకుని గత ప్రభుత్వంపై ముఖ్యమంత్రిరేవంత్‌రెడ్డి పోరాటం చేశారని, ఆయనను, పార్టీని బలహీనపర్చాలని కొందరు ప్రయ త్నం చేస్తున్నారని ఎమ్మెల్యే నవీన్‌యాదవ్ ఆరోపించారు. ప్రజల ఆశీస్సులు, మాలాంటి వారి అండదండలు ఉ న్నంత వరకు రేవంత్‌రెడ్డిని ఎవ్వరూ ఏమీ చేయలేరన్నారు.
కష్టపడి పనిచేసే వారిని పార్టీ తప్పకుండా గుర్తిస్తుందనడానికి తానే ఉదాహరణ అని పేర్కొన్నారు. విమర్శలు చేసే వారు తక్షణమే సీఎం రేవంత్‌రెడ్డికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. క్రమశిక్షణ తప్పిన వారిపై పార్టీ కూడా చర్యలు తీసుకోవాలని కోరారు.






