9 July, 2026 | 9:49 PM

పంజాగుట్టలో వైఎస్సార్‌ విగ్రహానికి సీఎం, డిప్యూటీ సీఎం నివాళి

08-07-2024 11:34 AM

హైదరాబాద్: ప్రజాభవన్‌లో వైఎస్సార్‌ జయంతి సందర్భంగా ఫోటో ఎగ్జిబిషన్‌ ఏర్పాటుచేశారు. వైఎస్సార్‌ 75వ జయంతి సందర్భంగా పంజాగుట్టలో వైఎస్సార్‌ విగ్రహానికి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్ విక్రమార్క నివాళులర్పించారు. ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల నిర్వహిస్తున్న వైఎస్ఆర్ జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం విజయవాడకు పయనం కానున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి (వైఎస్‌ఆర్‌) 75వ జయంతి వేడుకలకు సీఎంతో పాటు డిప్యూటీ సీఎం, పలువురు మంత్రులు కూడా హాజరుకానున్నారు.