11-08-2024 06:49:59 AM
హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఆగస్టు 10 (విజయక్రాంతి): రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ను అనుసంధానం చేస్తూ అభివృద్ధి చేసిన రహదా రులు రియల్ రాబడికి వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. గతంలో విజయవాడ జాతీయ రహదారికి ఇరువైపులా రియల్టీ పరుగులు పెట్టగా, తాజాగా వరంగల్ జాతీయ రహదారితోపాటు బెంగళూరు, నాందేడ్ జాతీయ రహదారుల వెంట రియల్టీకి ఆధరణ క్రమంగా పెరుగుతోంది. అలాగే ప్రతిపాధిత రీజినల్ రింగ్ రోడ్డు నిర్మించనున్న ప్రాంతాల్లోనూ రియల్టీ పరుగులు పెడుతోంది.
సమీప భవిష్యత్తులో ఈ రహదారులు పెట్టబడికి భరోసానిచ్చే మార్గాలుగా మారుతాయని రియల్టర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా బెంగళూరు హైవే, కొత్తగా అందుబాటులోకి వచ్చిన నాందేడ్ జాతీయ రహదారి వెంట ఓపెన్ ప్లాట్లకు డిమాండ్ పెరిగింది. గతంలో హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డును ఆనుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారాలు జరిగితే, ఇప్పుడు జాతీయ రహదారులు, రీజినల్ రింగ్ రోడ్లకు సమీప ప్రాంతాలన్నీ కూడా రియల్ రంగానికి ప్రధాన కేంద్రాలు ఎదుగుతున్నాయి.
ప్రస్తుతం హైదరాబాద్‌లోని బడా రియల్ కంపెనీలు ఈ రహదారుల వెంట భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. అయితే ఈ రహదారుల వెంట నమ్మకమైన, విశ్వసనీయత కలిగిన రియల్టర్ల వద్ద మాత్రమే ప్లాట్లు కొనుగోలు చేసేందుకు బయ్యర్లు ఆసక్తి చూపుతున్నారు. బయ్యర్లకు భరోసానిస్తూ పెట్టుబ డితో రాబడి పొందే ప్రాంతాలను ఎంపిక చేసుకుని, అన్ని అనుమతులతో ఓపెన్ ప్లాట్లను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని ఎస్‌ఆర్‌ఆర్ ఫార్చ్యూ న్ ఇన్‌ఫ్రా మేనేజింగ్ డైరెక్టర్ పరుపాటి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం ‘విజయక్రాంతి’తో మాట్లాడిన ఆయన పలు ఆసక్తికర అంశాలను వెల్లడించారు. మిగతా విషయాలు ఆయన మాటల్లోనే..
రియల్టీకి బూస్టింగ్..
దూరదృష్టితో సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్ అభివృద్ధికి ప్రణాళికలు రూపొం దిస్తున్నారు. ఇందులో భాగంగా శివారు ప్రాంతాలకు మెట్రో రైలు విస్తరణ, ఆర్‌ఆర్‌ఆర్‌పై ప్రత్యేక దృష్టి, హైవేల వెంట పారిశ్రామిక జోన్ల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో మెరుగైన రవాణా సదుపాయాలు అందుబాటు ఉండటంతో స్థానికంగా కమర్షియల్ యాక్టివిటీ పెరిగి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. దీంతో సమీప ప్రాంతాలన్నీ క్రమంగా రెసిడెన్షియల్, కమర్షియల్ కార్యకలాపాలకు అనుకూలంగా అభివృద్ధి చెందేలా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళికలు అమలు చేయడం అభినందనీయం.
ఇక శివారు ప్రాంతాలను దాటి మెట్రో విస్తరణ చేయడం రియల్ ఎస్టేట్ వృద్ధికి దోహదపడుతుంది. గతంలోనే ప్రతిపాదించిన షాద్‌నగర్ వరకు మెట్రో విస్తరణ, ఇటు విజయవాడ హైవే, వరంగల్ హైవేతోపాటు సంగారెడ్డి వరకు మెట్రో విస్తరించాలనే ప్రతిపాదనలన్నీ కూడా పరోక్షంగా రియల్ ఎస్టేట్ రంగానికి ప్రభావితం చేసేవి. రియల్ ఎస్టేట్ రంగంపై సమగ్ర అవగాహన కలిగిన సీఎం రేవంత్‌రెడ్డి హయాంలో రియల్టీకి మంచి భవిష్యత్తు ఉంటుంది.
శాటిలైట్ టౌన్ షిప్, నగరానికి నలువైపులా ఇండస్ట్రీయల్ పార్కుల ఏర్పాటుతో వెస్ట్ సిటీ తరహాలో ఆయా ప్రాంతాల్లో అభివృద్ధికి ఆస్కారం ఉంటుంది. నగరంలో భారీగా పెరిగిన భూములు, నిర్మాణ ధరల దృష్ట్యా సామాన్యుడి సొంతింటి నిర్మాణం అత్యంత భారంగా మారుతుంది.