11-08-2024 06:48:09 AM
హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఆగస్టు 10 (విజయక్రాంతి): ప్రస్తుత సంవత్సరం మొదటి త్రైమాసికంలో రెసిడెన్షియల్ మార్కెట్ హవా కొనసా గింది. దేశంలో ముంబై తర్వాత హైదరాబాద్ ఖరీదైన రెసిడెన్షియల్ మార్కెట్‌గా నిలిచిందని శనివారం నైట్‌ఫ్రాంక్ నివేదిక వెల్లడించింది. నగరంలో హౌసింగ్ యూనిట్ నెలవారి వాయిదాకు నిధులు సమకూర్చుకోవడానికి సగటున 40 శాతం మంది ప్రజలు నిధులు సమకూర్చుకుంటున్నట్లు నివేదికలో పేర్కొన్నారు. ఈ అంశంపై దేశంలోని 8 ప్రధాన నగరాల్లో సర్వే నిర్వహించామని నైట్‌ఫ్రాంక్ తెలిపింది.
50 శాతం ఈఎంఐతో ముంబై మొదటి స్థానంలో నిలువగా, 30 శాతం ఈఎంఐతో ద్వితీయ స్థానంలో హైదరాబాద్ ఉందని, ఢిల్లీలో 20 శాతం, బెంగుళూరులో 26 శాతం, చెన్నైలో 25 శాతం, కోల్‌కతా 24 శాతం, అహ్మదాబాద్‌లో 21శాతం ఉందని ఈ నివేదిక స్పష్టం చేసింది. బయ్యర్ల డిమాండ్‌ను కాపాడుకునేందుకు స్థిరమైన ఆర్థిక స్థోమత చాలా అవసరం అని నైట్‌ఫ్రాంక్ ఇండియా ఎండీ శిశిర్ బైజల్ తెలిపారు. 2025 ఆర్థిక సంవత్సరానికి ఆర్‌బీఐ 7.2 శాతం జీడీపీ వృద్ధిని అంచనా వేస్తుందని, 2024లో గృహ కొనుగోలుదారులకు ఇది ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.