26 June, 2026 | 11:09 AM

లిఫ్ట్ ఇరిగేషన్ భూసేకరణపై సమీక్ష సమావేశం

26-06-2026 10:23 AM

సూర్యాపేట ఆర్డీవో వేణుమాధవరావు 

మోతె,జూన్ 26 (విజయక్రాంతి): మండల కేంద్రము లోని తహసీల్దార్ కార్యాలయంలో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ అంశాలపై గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సూర్యాపేట ఆర్డీవో వేణుమాధవరావు తో పాటు ల్యాండ్ అక్విజిషన్ అధికారి హాజరై ప్రాజెక్టు పరిధిలోని సిరికొండ, విభ లాపురం, అన్నారుగూడెం, బురకచర్ల గ్రామాల రైతులతో చర్చించారు.

ఈ సందర్భంగా భూసేకరణ ప్రక్రియ పురోగతి, రైతుల అభిప్రాయాలు, పరిహారం చెల్లింపులకు సంబంధించిన అంశాలపై అధికారులు సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా అన్నారుగూడెం గ్రామంలో ప్రాజెక్టు అవసరాల దృష్ట్యా అదనంగా 5 ఎకరాల 20 గుంటల భూమిని సేకరించాల్సి ఉండటంతో, దీనిపై నెగోషియేషన్ కమిటీ రైతులు, గ్రామస్థులతో ప్రత్యేకంగా చర్చించింది. రైతుల అభిప్రాయాలను తెలుసుకుని, వారి సందేహాలకు అధికారులు సమాధానాలు ఇచ్చారు.

భూసేకరణ ప్రక్రియను పారదర్శకంగా, నిబంధనల ప్రకారం చేపట్టాలని అధికారులు సంబంధిత సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ వెంకన్న, డిప్యూటీ తహసీల్దార్ పుష్ప , ఆర్‌ఐలు కరుణాకర్ రెడ్డి, రమేష్, ఇరిగేషన్ శాఖ ఏఈ సుస్మిత, జిపిఓలు తో పాటు సంబంధిత అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.