26 June, 2026 | 11:39 AM

కీతవారిగూడెంలో కొలువుదీరిన కనకదుర్గమ్మ

26-06-2026 10:25 AM

వేదమంత్రోత్సవాల మధ్య అమ్మవారి ప్రతిష్ట 

ఘనంగా ధ్వజస్తంభ ప్రతిష్ట

భక్తి పరవశంతో కలకలలాడిన కీతవారిగూడెం

గరిడేపల్లి, జూన్ 26, (విజయక్రాంతి): మండలంలోని కీతవారిగూడెం గ్రామంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన శ్రీ కనకదుర్గమ్మ, శ్రీ అంకమ్మ, శ్రీ మారమ్మ, శ్రీ మద్దిరావమ్మ, శ్రీ సింహ వాహన, ద్వారా శక్తుల, కీర్తిధ్వజ, పోతురాజు, స్థిరప్రతిష్ట, మహోత్సవమును గురువారం  భక్తిశ్రద్ధలతో అత్యంత వైభవంగా వేదమంత్రోత్సవాల మధ్య ఘనంగా ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించారు. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమై పిలిస్తే పలికే ప్రత్యక్ష దైవంగా కనకదుర్గ అమ్మవారిని మహిళా భక్తులు పసుపు కుంకుమలతో దర్శించుకునేందుకు తెల్లవారుజామునుండే బారులు తీరారు.

వేద పండితులు బ్రహ్మశ్రీ రాయప్రోలు శ్రీరామయ్య శర్మ, బ్రహ్మశ్రీ భద్రయ్య శర్మ, బ్రహ్మశ్రీ రాళ్ళబండి రాజశేఖర్ శర్మ , బృందంచే శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు హోమాలు నిర్వహించారు.గ్రామస్తుల సహాయ సహకారాలతో నిర్మించిన  దేవాలయాలకు కమిటీ సభ్యులు అమ్మవారి మాలలు ధరించి మూడు రోజులుగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా బిఆర్ఎస్ నాయకులు పిల్లుట్ల రఘు, గ్రామ సర్పంచ్ బొల్లేపల్లి రామనాథం, పిఎసిఎస్ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ పెద్దలు, మహిళలు, కమిటీ సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.