26 June, 2026 | 12:24 PM

ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ...

26-06-2026 10:38 AM

ఎంఎల్ఎస్ పాయింట్ లో బియ్యం దుస్థితి

మంచిర్యాల,(విజయక్రాంతి): ప్రభుత్వం పేదలకు ఉచితంగా పంపిణీ చేస్తున్న పీడీఎస్ బియ్యం ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తుంది... జూలై మొదటి వారం నుంచి జిల్లాలో రేషన్ బియ్యం పంపిణి ప్రారంభం కానుంది. ఈ సమయంలో వర్షానికి బియ్యం తడవడంతో పాటు ముక్క వాసన వస్తుండటంతో ఈ బియ్యమే తమకు వస్తాయా? అనే అనుమానాలు రేషన్ లబ్ధిదారులు వ్యక్తం చేస్తున్నారు. మిల్లుల నుంచి ఎంఎల్ఎస్ పాయింట్ కు వచ్చిన బియ్యం రిజెక్ట్ అయితే అక్కడ ఉంచారా? అనేది కూడా తేలాల్సి ఉంది.

ఏదీ ఏమైనా టన్నుల కొద్ది సన్న బియ్యం ఇలా నిర్లక్ష్యంగా వరండాలో ఉంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఇటీవల కురిసిన వర్షానికి తడిసి ముద్దయ్యాయి. ఈ విషయమై ఎంఎల్ఎస్ పాయింట్ ఇంఛార్జీ విజయను సంప్రదించగా అవి ఎంఎల్ఎస్ పాయింట్ బియ్యం కాదని, బఫర్ గోడౌన్ కి సంబంధించిన బియ్యం కావచ్చునని, ఇది ఎస్ డబ్ల్యూ సీ పరిధిలో ఉంటుందని సమాధానమిచ్చారు. ఏది ఏమైనా లక్షలు విలువచేసే టన్నుల కొద్ది బియ్యాన్ని ఇలా నిర్లక్ష్యంగా గాలికి వదిలేయడం పట్ల పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు.