విజయవాడ దుర్గమ్మ ఆలయ అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై సమీక్ష
అమరావతి,(విజయక్రాంతి): విజయవాడ కనక దుర్గమ్మ ఆలయ అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ట్రస్ట్ బోర్డు కార్యాలయంలో ఆదివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి మాట్లాడుతూ... దుర్గమ్మ ఆలయానికి రోజు రోజుకు భక్తుల రద్దీ పెరుగుతుండడంతో గుడికి వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించేందు ఏపీ ప్రభుత్వం ప్రసాద్ పథకం కింద రూ.100 కోట్లతో గుడి అభివృద్ధి పనుల కోసం మాస్టర్ ప్లాన్ తయారీకి పెద్దపీట వేసిందన్నారు. ఆలయ అభివృద్ధికి ఎంపీ కేశినేని శివనాథ్ సూచనలు చేశారు. వందేళ్ల అవసరాలకు సరిపోయేలా వసతుల కల్పన లక్ష్యం చేస్తున్నామన్నారు. భక్తులు క్యూలైన్ లో వేచి ఉండకుండా వెయిటింగ్ హాల్స్ నిర్మించాలని సూచించారు. కేంద్ర ప్రథకం ప్రసాద్ ద్వారా నిధుల సాధనకు ప్రతిపాదనలు పెట్టాని శివనాథ్ పేర్కొన్నారు.






