11 July, 2026 | 9:34 PM

మహారాష్ట్ర సీఎం ఎంపికపై రేపు నిర్ణయం

01-12-2024 06:59 PM

ముంబయి,(విజయక్రాంతి): మహారాష్ట్రంలో మరికొన్ని రోజుల్లో కొత్త ప్రభుత్వం కొలవుతీరనుంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎంపికపై ఉత్కంఠ నెలకొంది. రాష్ట్ర సీఎం ఎంపికపై రేపు నిర్ణయం తీసుకుంటామని ఆపధర్మ సీఎం ఏక్ నాథ్ షిండే స్పష్టం చేశారు. తాను మహాయుతి ప్రభుత్వానికి మద్దతు ప్రకటించినట్లు తెలిపారు. విపక్షనేతను ఎంచుకోలేని స్థితిలో ప్రతిపక్షం ఉందని, మహారాష్ట్ర సీఎంగా ఎవరు ఉండాలనేది బీజేపీ నిర్ణయం తీసుకుంటుందని ఆయన వెల్లడించారు.

ప్రభుత్వ ఏర్పాటుపై మహాయుతి కూటమి చర్చలు సాగుతున్నాయని, తామ కూటమిలో ఎలాంటి భేదాభిప్రాయాలు లేవన్నారు. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్న అందుకు ఆయన కట్టబడి పూర్తి సహకారం ఎల్లప్పుడూ ఉందని ఏక్ నాథ్ షిండే పేర్కొన్నారు. ఈ నెల 5వ తేదీన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఉంటుంది. కానీ, ఇప్పటివరకు మహారాష్ట్ర సీఎం ఎవరనేది స్పష్టతలేదు. బీజేపీ నుంచి డిప్యూటి సీఎంగా ఫడణవీస్ పేరు వినిపిస్తోంది. ముఖ్యమంత్రి పేరు ప్రకటించడంలో ఆలస్యం చేయడం రాష్ట్రానికి అవమానం అంటూ శివసేన నేత ఆదిత్య ఠాక్రే వివర్శించారు.