ఫెంగల్ బీభత్సం
శనివారం అర్ధరాత్రి తీరాన్ని దాటిన తుఫాన్
తమిళనాడు, ఏపీలో భారీ వర్షాలు
చెన్నై ఎయిర్‌పోర్ట్ మూసివేత
శంషాబాద్, తిరుపతి ఫ్లయిట్స్ రద్దు
చెన్నై/రాజేంద్రనగర్, నవంబర్ 30: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర తుఫాన్‌గా మారింది. ఫెంగల్ తుఫాన్ తమిళనాడు, పుదుచ్చేరి, ఏపీలో తీవ్ర ప్రభావం చూపుతోంది. తుఫాన్ శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత మహాబలి పురం, కారైకల్ మధ్య తీరాన్ని దాటింది. తుఫాన్ ప్రభావంతో ఇప్పటికే తమిళనాడు అంతటా భారీ వర్షా లు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యా యి.
జనజీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది. తీర ప్రాంతాల్లో భీకర గాలులు వీస్తున్నాయి. భారీ నుంచి అతి భారీ వర్షా లు కురిసే అవకాశం ఉందని చెన్నై వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో రాష్ట్ర ప్రభు త్వం అప్రమత్తమైంది. ప్రభావిత ప్రాంతాల్లో సహాయక శిబిరాలను ఏర్పాటు చేసినట్లు తమిళనాడు సీఎం స్టాలిన్ వెల్లడించారు. తుఫాన్ వల్ల ఎటువంటి నష్టం వాటిల్లకుండా సహాయక చర్యలను ఆయన దగ్గ రుండి పర్యవేక్షిస్తున్నారు.
పలు జిల్లాలకు రెడ్ అలర్ట్
భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రజలకు ప్రభుత్వం సూచించింది. తుఫాన్ నేపథ్యంలో తమిళనాడు, పుదుచ్చేరిలో గంటకు 80 కి.మీ. వేగంతో గాలులు వీస్తున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా మారిం ది. దీంతో మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తమిళనాడులోని చెన్నై, తిరువళ్లూరు, చెంగల్‌పట్టు, కాంచీపురం, విల్లుపు రం, కల్లకురిచ్చి, కుద్దలూరు, పుదుచ్చేరికి రెడ్ అలెర్ట్ ప్రకటించారు.
ఏపీలో వర్షాలు..
ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు పడుతాయని అధికారులు తెలిపారు. నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. దీంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది.
పలు విమానాలు రద్దు
చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో రన్‌వేపైకి వరదనీరు చేరడంతో తాత్కాలికంగా విమానాశ్రయాన్ని అధికారులు మూసివేశారు. పలు విమాన సర్వీసులను రద్దు చేశారు. కొన్ని సర్వీసులను దారి మళ్లించారు. శంషాబాద్ నుంచి చెన్నైకి వెళ్లాల్సిన 6ఈ598, 6ఈ6316, 6ఈ6007, 6ఈ6617 విమానాలు, అదేవిధంగా చైన్నె నుంచి హైదరాబాద్ రావాల్సిన 6ఈ193, 6ఈ6317, 6ఈ341, ఏఐ545 విమానాలను కూడా రద్దు చేశారు.
హైదరాబాద్ నుంచి తిరుపతి, చెన్నై వెళ్లాల్సిన విమానాలను కూడా క్యాన్సిల్ చేశారు. తిరుపతికి వెళ్లాల్సిన ౭, చెన్నై నుంచి మూడు విమానాలు, తిరుపతి నుంచి హైదరాబాద్ రావాల్సిన ౭ విమానాలు రద్దయ్యాయి. ఢిల్లీ ఫ్లయిట్ ఏఐ429ను దారి మళ్లించారు. భారీ వర్షాలతో మా ఎయిర్‌పోర్ట్‌ను మూసేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. వర్షాల కారణంగా రైళ్లు ఆలస్యంగా నడుస్తుండగా కొన్నింటిని రైళ్లను రద్దు చేశారు.
ఏటీఎంలో కరెంట్ షాక్‌తో ఒకరి మృతి
ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నా యి. ఈ క్రమంలో చెన్నైకి చెందిన ఓ వ్యక్తి డబ్బులు డ్రా చేసుకోవడానికి నగరంలోని ఓ ఏటీఎంలోకి వెళ్లాడు. అయితే అప్పటికే ఏటీఎం రూంలో వరదనీరు చేరింది. దీంతో ఆ వ్యక్తికి కరెంట్ షాక్ వచ్చి ఏటీంఎంలోనే చనిపోయాడు. వరద తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఏటీఎం నుంచి అతడి మృతదేహం బయటకు కొట్టుకువచ్చింది.
వరదలో డెడ్‌బాడీ కొట్టుకుపోతున్న దృశ్యాలు నెట్‌లో వైరల్‌గా మారాయి. స్థానికుల సమాచారంతో పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.






