13 August, 2026 | 4:32 AM

కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై సమీక్ష

13-08-2026 02:05 AM

మేడ్చల్, ఆగస్టు 12 (విజయ క్రాంతి): వా నాకాలం ధాన్యం సేకరణ కేంద్రాల ఏర్పాటు విషయమై  అదనపు జిల్లా విజయేందర్ రెడ్డి సంబంధిత అధికారులతో సమీక్ష సమావే శం నిర్వహించారు. సమీక్ష సమావేశంలో పౌరసరఫరాల జిల్లా మేనేజర్ సుగుణ బా యి, డీఏవో చంద్రకళ, జిల్లా పౌరసరఫరాల అధికారి శ్రీనివాస్ రెడ్డి,  జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారి ఎండి రియాజ్ ఇతర అధికా రులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా విజయేందర్ రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో 15 కొనుగోలు కేంద్రాలు, అవసరమైన మేరకు గన్నీ బ్యాగులు అందుబాటులో  ఉంచాలని ఆదేశించారు. వడ్లను తడి, తాలు  దుమ్ము లేకుండా ఆరబెట్టి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని రైతులకు అవగాహన క ల్పించాలని సూచించారు.

కొనుగోలు కేం ద్రాల ఇన్చార్జీలు, వ్యవసాయ విస్తరణ అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించి, కొనుగోలు ప్రక్రియను సమర్థవంతంగా ని ర్వహించాలని సూచించారు. ట్యాబ్ ఎంట్రీ లు ఆలస్యమవడం వల్ల రైతుల చెల్లింపులు ప్రభావితమవుతున్నందున, ప్రతి ఎంట్రీను అదే రోజు పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రైతుల సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు జిల్లా స్థాయిలో నిరంతర సమీక్ష నిర్వహించాలని కూడా తెలిపారు. రైతులు తమ ధాన్యం అమ్మిన 48 గంటలలోపే వారి ఖాతాల్లో నేరుగా చెల్లింపులు జమ చేయబడతాయని పేర్కొన్నారు. సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేసి ధాన్యం కొనుగోలు విషయంలో జిల్లాకు, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు.