13 August, 2026 | 4:01 AM

కొత్త మార్గంలో ప్రశాంత్ కిశోర్

13-08-2026 01:14 AM

ప్రజాస్వామ్య వ్యవస్థలో సరికొత్త విధానానికి శ్రీకారం

గెలిచిన తరువాత హామీలు ఇచ్చిన పీకే

హైదరాబాద్, ఆగస్టు 12 (విజయక్రాం తి): బీహార్‌లోని బాంకీపూర్ నుంచి కొత్తగా ఎమ్మెల్యేగా ఎన్నికైన జన సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ (పీకే)చేసిన తాజా ప్రకటనలు రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు తెరలేపాయి. సాధారణంగా ఎన్నికల సమయంలో హామీలు ఇవ్వడం, ఆ తర్వాత వాటి అమలుకు దీర్ఘకాలిక ప్రక్రియ కొనసాగడం పరిపాటి. అయితే ప్రశాంత్ కిశోర్ మాత్రం ఎన్నికల అనంతరం తన ని యోజకవర్గంలో ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపే కార్యక్రమంలో భాగంగా.. ‘ఆభార్ యాత్ర’ పేరుతో ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకోవడమే కాకుండా.. అనేక ప్రతిష్ఠాత్మక హామీలను ప్రకటించారు.

వృద్ధులకు ఆర్థిక సాయం

పేదరికంలో ఉన్న వృద్ధులకు నెలకు రూ.1,100 ఆర్థిక సాయం అందిస్తామని పేర్కొన్నారు. ఉపాధి, విద్య, సామాజిక భద్రత మూ డు కీలక అంశాలను ఒకేసారి స్పృశించే ప్రయత్నంగా ఈ హామీలను చూడవచ్చు. కాగా ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. హామీ ఇవ్వడం ఒకటైతే.. దానిని వ్యవస్థీకృతంగా అమలు చేయడం మరొకటి. ఎమ్మెల్యే వ్యక్తిగత పరిచయాల ద్వారా వేలాది ఉద్యోగాలను కల్పించడం ఎంతవరకు సాధ్యమవుతుంది?

ఉద్యోగాలకు ఎంపిక చేసే విధానం ఎంత పారదర్శకంగా ఉంటుంది? ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు, ఉపాధ్యాయుల నియామకం వంటి అంశాలు కేవలం ఎమ్మెల్యే సంక ల్పంతోనే పూర్తవుతాయా? వృద్ధులకు ఆర్థిక సహాయం అందించేందుకు నిధులు ఎక్కడి నుంచి వస్తాయి? ఇవన్నీ సమాధానం కావాల్సిన ప్రశ్నలే.. అయితే  కిశోర్ మద్దతుదారులు మాత్రం ఆయన రాజకీయ వ్యూహకర్తగా, నిర్వాహకుడిగా సంపాదించుకున్న పరిచయాలు ఈ ప్రయత్నానికి ఉపయోగపడతాయ ని అంటున్నారు.

మరోవైపు విమర్శకులు మాత్రం తక్కువ వ్యవధిలో 10 వేల ఉద్యోగాలు వంటి భారీ లక్ష్యాలు పెట్టుకోవడం వల్ల అంచనాలు కూడా అదే స్థాయిలో పెరుగుతాయని హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఈ హామీల ప్రభావం కేవలం బాంకీపూర్‌కు మాత్రమే పరిమితం కాకపోవచ్చు. వేగంగా ఉద్యోగ అవకాశాలను కల్పించడం, పాఠశాలలను మెరుగుపర్చడం, వృద్ధులకు ఆర్థిక సాయం అందించడం వంటివి ఇతర ప్రజాప్రతినిధులపైకూడా ఇలాంటి స్పందన చూపిం చాలనే ఒత్తిడి పెంచవచ్చని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

ఈ పరిణామంలో మరో ముఖ్యమైన అం శం ప్రజల అంచనాల్లో మార్పు. జంతర్ మంతర్, రాంచీ వంటి ప్రాంతాల్లో జెన్‌జీ, యువత నేతృత్వంలో జరిగిన నిరసనలు వ్యవస్థను ప్రశ్నించే కొత్త రాజకీయ సంస్కృతికి సంకేతాలుగా నిలిచాయి. అదే విధంగా, ఒక ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో ఉద్యోగాలు, విద్య, వృద్ధుల సంక్షేమంపై తక్షణ చర్యలకు పూనుకుంటే, ఇతర నియోజకవర్గాల ప్రజలు కూడా తమ ప్రజాప్రతినిధులను ఇదే తరహా లో ప్రశ్నించే అవకాశం ఉంది.

ఇది ప్రజాస్వామ్యంలో ఆరోగ్యకరమైన పరిణామమే కా వచ్చు. ఇప్పటి వరకు సంప్రదాయ రాజకీయ పరిరక్షణ, దీర్ఘకాలిక మౌలిక వసతుల ప్రాజక్టులపై ఆధారపడ్డ ప్రజాప్రతినిధులు.. ఉపాధి, సంక్షేమం వంటి అంశాల్లో మరింత వేగంగా, స్పష్టంగా ఫలితాలను చూపించాల్సిన పరిస్థితి ఎదురవ్వవచ్చు.

అయితే వ్యక్తిగత ప్రభావం ఆధారంగా నడిచే మోడల్‌కు పరిమితులు కూడా ఉన్నాయి. ఒక ఎమ్మెల్యే పరిచయాలు మారితే, పదవీకాలం ముగిస్తే లేదా రాజకీయ పరిస్థితులు మారితే ఆ కార్యక్రమాల పరిస్థితి ఏమిటన్నది కీలకం. అందుకే తాత్కాలిక వ్యక్తిగత చొరవలతో పాటు, దీర్ఘకాలికంగా పనిచేసే సంస్థాగత వ్యవస్థలను నిర్మించడం మరింత అవసరం. ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలవడంకూడా దూరంగా ఉండే పాలనకు బదులుగా.. నిజమైన ప్రజా సంబంధాలకు ఆయన ప్రాధాన్యానికి నిదర్శనమని చెబుతున్నారు.

10 వేల ప్రైవేటు ఉద్యోగాల కల్పన

వీటిలో ప్రధానమైనది.. బాంకీపూర్ నియోజకవర్గంలోని నిరుద్యోగులు, యు వతకు ప్రైవేటు రంగంలో సుమారు 10 వేల ఉద్యోగాలు కల్పించాలన్న హామీ. దేశవ్యాప్తంగా తనకున్న పరిచయాలు, సంస్థ లతో ఉన్న సంబంధాలను ఉపయోగించుకుని ఈ ఉద్యోగాలను ఒక ఏడాది లోగా అందుబాటులోకి తెస్తానని ఆయన ప్రకటించారు. ఇందుకోసం అర్హతలు ఉన్న యువత తమ బయోడేటాలను ఎమ్మెల్యే కార్యాలయానికి అందించాలని కోరారు.

నిరుద్యోగం అనే నిరంతర సమస్యకు ఇది ఒక ఆచరణాత్మక పరిష్కార మని కిశోర్ పేర్కొన్నారు. ఉపాధి కార్యక్రమంతోపాటు.. విద్యా రంగంపైనా కిశోర్ స్పష్టమైన హామీలు ఇచ్చారు. నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో అవసర మైన మౌలిక వసతులు, సరిపడా ఉపాధ్యాయులు, మెరుగైన బోధనా ప్రమాణా లను కొద్ది నెలల్లోనే అందుబాటులోకి తెస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు.