13 May, 2026 | 4:12 AM

పోలీసుల నిర్లక్ష్యంతోనే గద్వాలలో జోరుగా దొంగతనాలు

21-06-2024 12:12 PM

దొంగతనం జరిగిన ఇంటిని సందర్శించిన ఎమ్మెల్యే

గద్వాల, (వనపర్తి ), (విజయక్రాంతి ):  పోలీసుల నిర్లక్ష్యమేతో గద్వాల లో జోరుగా దొంగతనాలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో  దొంగతనం జరిగిన ఇంటిని ఎమ్మెల్యే సందర్శించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... పోలీసుల అప్రమత్తంగా లేకపోవడంతోనే దొంగతనాలు విపరీతంగా జరుగుతున్నాయని, భవిష్యత్తులో ఇదే మాదిరిగా దొంగతనాలు జరిగితే  ఉద్యమం చేయడానికి సిద్ధమన్నారు. దొంగతనం జరిగిందని రాత్రి బాధితులు చూసుకొని పోలీసులకు ఫిర్యాదు చేయగా ఉదయం వరకు పోలీసులు రాకపోవడంతో ఎమ్మెల్యే వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

దొంగతనం జరిగిన ఇంటిదగ్గర పోలీస్ అధికారి సి.ఐతో ఫోన్ లో మాట్లాడారు. పోలీస్ ఏమి చేస్తున్నారు,  గద్వాలలో రోజురోజు దొంగతనాలు జోరుగా జరుగుతున్నాయని, ప్రజలకు భద్రత కల్పించాల్సిన పోలీసు వ్యవస్థ నిద్రపోతుంది అని హెచ్చరించారు. వెంటనే ఈ దొంగతనాల పైన చర్యలు తీసుకొని ప్రత్యేకమైన పోలీసులకు నిర్వహించి రాత్రిపూట భద్రత పెంచాలని సూచించారు.  గద్వాల పట్టణంలో నేను సొంత ఖర్చులతో దాదాపుగా 30 లక్షలతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగిందని . దానిని ఉపయోగంలో ఉన్నాయా పనిచేస్తున్నాయ లేదా అనేది పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు.