18 April, 2026 | 10:56 PM

Breaking News

దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ పాదయాత్రలు చేస్తుంటే.. దేవుడి పేరుతో బీజేపీ ఓట్ల రాజకీయం   •   మొయినాబాద్‌లో ఆరివ్ అలైవ్ రహదారి భద్రత అవగాహన కార్యక్రమం ముగింపు   •   వేసవి సెలవుల నేస్తం పుస్తకావిష్కరణ   •   బిఆర్ఎస్ మినీ ప్లీనరీని విజయవంతం చేయండి: మాజీ ఎమ్మెల్యే హరిప్రియ   •   గిరిజన గురుకులాలకు భవనాలు లేక కిరాయి ఇండ్లలో నడుస్తున్నాయి   •   స్పెషల్ డ్రైవ్ ద్వారా భూ సమస్యలు పరిష్కరించాలి   •   మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ తీరును నిరసిస్తూ..   •   గడువు పెంపు   •   పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి.... దోమల నివారణను అరికట్టండి   •   శుశ్రుత హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదాలపై అవగాహన   •  

పేదలందరికీ సన్న బియ్యం

01-04-2025 11:03 PM

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మహేందర్..

పెద్ద కొడప్గల్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్గల్ తెలంగాణాలో పేదలందరికీ నేటి నుండి సన్న బియ్యం పంపిణీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని కాంగ్రెస్ పార్టీ పెద్ద కొడప్గల్ మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డి అన్నారు. ఆయన మంగళవారం పెద్ద కొడప్గల్ మండలం కాటేపల్లి గ్రామములోని రేషన్ షాపులో సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నిన్నటి వరకు రేషన్ షాప్ ల ద్వారా దొడ్డు బియ్యం అందించే వారని, ఈ బియ్యాన్ని అమ్మేసి చాలా మంది సన్న బియ్యంకొనే వారని తెలిపారు.

ఇది గమనించిన మన సీఎం సన్న బియ్యం పథకం ప్రారంభించి పేదల కడుపు నింపుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో వైస్ చైర్మన్ గంగాగౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్లప్ప పటేల్, శ్యామప్ప పటేల్, చిప్ప మోహన్, అహ్మద్, మొగుళా గౌడ్, బస్వరాజ్ దేశాయ్, నాగరాజ్, ఇస్మాయిల్ పటేల్, రియాజ్ పటేల్, హాజీ పటేల్, యూసఫ్ పటేల్, చౌటకూరి శంకర్, రాంచందర్, హన్మాండ్లు, రవి, అశోక్, బాల్ రాజ్, పాండు నాయక్, బార్థ్యా నాయక్ తదితరులు పాల్గొన్నారు.