23 May, 2026 | 12:29 AM

బాలీవుడ్ పై రిషబ్ వ్యాఖ్యలు వైరల్

21-08-2024 04:02 PM

బెంగుళూరు: కనడ సినిమా స్టార్ హీరో రిషబ్ శెట్టి  బాలీవుడ్ పై  వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో బాలీవుడ్ మనదేశాన్ని తక్కువ చేసి చూపించిందన్నారు. తాను దేశం గర్వ పడేలా సినిమాలు తీస్తున్నట్లు చెప్పుకొచ్చారు. కాంతారా సినిమాలో రిషబ్ ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. మన చిత్రాలను గ్లోబల్ ఈవెంట్లకు ఆహ్వానించి రెడ్ కార్పెట్ వేస్తారు. అందుకే నేను నా దేశం, నా రాష్ట్రం, నా భాష గురించి గర్వంగా మాట్లాడేలా చెయ్యాలని ఆశిస్తానని రిషబ్ చెప్పారు. బాలీవుడ్ సినిమాలో  పలువురు దర్శకులు భారత దేశాన్ని బీద దేశంగా నెగెటివ్ గా చూపిస్తారని ఆయన విమర్శించారు. ఈ వ్యాఖ్యలు వైరల్ కావడంతో ఆయన గతంలో నటించిన సినిమా సన్నివేశాలను షేర్ చేస్తున్నారు.