1 July, 2026 | 3:23 PM

అప్పుల బాధతో ఆర్‌ఎంపీ డాక్టర్ ఆత్మహత్య

10-06-2025 12:24 AM

చేగుంట, జూన్ 9 : అప్పుల బాధ  భరించలేక ఆర్‌ఎంపి వైద్యుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన చేగుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని మాసాయిపేట్ మండలం  పోతన్పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బర్రె మహేష్ (30) గత కొంతకాలం నుండి తూప్రాన్ మండలం మల్కాపూర్ గ్రామంలో ఆర్‌ఎంపీ డాక్టర్ గా పనిచేస్తున్నాడు.  కొంతకాలంగా బంధువులు, స్నేహితుల దగ్గర సుమారు రూ.13 లక్షల మేరకు అప్పులు చేశాడు.

చేసిన అప్పులు భారంగా మారి తీర్చలేక తన వ్యవసాయ పొలం వద్ద పురుగుల మందు తాగినట్లు తెలిపారు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు మెరిగైన చికిత్స నిమిత్తం  గాంధీ ఆసుపత్రికి తరలించగా ఆదివారం రాత్రి మరణించినట్లు తెలిపారు, విషయం తెలుసుకున్న చేగుంట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు.