15 April, 2026 | 1:14 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ప్రజావాణి దరఖాస్తులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి

10-06-2025 12:23 AM

కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్

సూర్యాపేట, జూన్ 9 (విజయక్రాంతి) : రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి ప్రజావాణిలో వచ్చే దరఖాస్తులపై ప్రత్యేక శ్రద్ద పెట్టి పరిష్కరించాలని అధికారులకి జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సూచించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశం మందిరంలో నిర్వహించిన ప్రజా వాణిలో జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు తో కలిసి జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ పాల్గొన్ని ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకి సేవ చేయటమే ఉద్యోగుల భాద్యత అని, అధికారులు ప్రజల కొరకు అందుబాటులో ఉండి పని చేయాలని ఒకవేళ విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకోవటం జరుగుతుందని తెలిపారు.  తదుపరి ప్రజావాణిలో భూ సమస్యలకి సంబందించి 31, ఎంపిడిఓలకి 11, హొసింగ్ శాఖకి 4,సంక్షేమ శాఖకి సంబంధించి 3, మిగిలినా 15 దరఖాస్తులు వివిధ శాఖలకి సంబంధించి వచ్చాయని మొత్తం 64 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. డి ఆర్ డి ఓ పి డి వి వి అప్పారావు, డిఇఓ అశోక్, డి పి ఓ యాదగిరి,సిపిఓ కిషన్,డి డబ్ల్యూ ఓ నరసింహారావు, డి సి ఓ పద్మ వెల్ఫేర్ డీఎవో శ్రీధర్ రెడ్డి సంక్షేమ అధికారులు శంకర్ శ్రీనివాస్ నాయక్ జగదీశ్వర్ రెడ్డి, గఅధికారులు, సిబ్బంది ,తదితరులు పాల్గొన్నారు.