17 April, 2026 | 4:14 PM

రైలు నుంచి పడి గుర్తు తెలియని వ్యక్తి దుర్మరణం

10-06-2025 12:24 AM

మహబూబాబాద్, జూన్ 9 (విజయ క్రాంతి): మహబూబాబాద్ జిల్లా ఇంటికన్నె కేసముద్రం రైల్వే స్టేషన్లో మధ్య సోమవారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తి రైల్లో నుండి జారిపడి ప్రమాదవశాత్తు దుర్మరణం పాలైన ఘటన జరిగింది.

మృతుడి వయసు 40 45 ఏళ్ల మధ్య ఉంటుందని,  క్రీమ్ కలర్ 3/4 షార్ట్, నేవీ బ్లూ కలర్ టీ- షర్ట్  ధరించి ఉన్నాడని, నల్లని తల వెట్రుకలు, గడ్డం మీసాలు కలిగి ఉన్న మృతుడు 5’5 ఎత్తు, చామన ఛాయా రంగు, గుండ్రని ముఖం, గుర్తుపట్టేందుకు కుడిపక్క చాతి పై పుట్టుమచ్చ కలదని, చనిపోయిన వ్యక్తి వద్ద దానాపూర్ నుంచి పెరంబుర్ వరకు గల రైల్వే వెయిటింగ్ లిస్ట్ టికెట్ ఉన్నదని రైల్వే జి ఆర్ పి హెడ్ కానిస్టేబుల్ రవీందర్ రెడ్డి తెలిపారు.

మృతుని వద్ద ఎలాంటి ఆధారాలు, గుర్తింపు కార్డులు లేవని , మృతదేహాన్ని వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ మార్చురీలో  భద్రపరిచామని,  వివరాలు తెలిసినట్లయితే  ఫోన్ నెంబర్లు 9849749220 , 8712658585 తెలియజేయాలని కోరారు.