2 September, 2026 | 11:24 PM

Breaking News

పెరిక్స్ పై ఇన్కమ్ టాక్స్ రద్దుకు అంగీకరించిన యాజమాన్యం   •   రెవరెండ్ డాక్టర్ గుండెపాక వెంకన్నకు ది ఐకానిక్ ఇండియా అవార్డు   •   గంజాయి సాగుచేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు   •   శేషగిరిరావును పరామర్శించిన జనసేన రాష్ట్ర నాయకులు డా గడల శ్రీనివాసరావు   •   నాలుగు క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత   •   అక్రమ కేసులు ఎత్తివేయాలి: రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రామచందర్‌రావు   •   కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ నిరసన   •   క్యాంప్ ఆఫీస్‌పై దాడి హేయమైన చర్య: ఎమ్మెల్యే కుంభం   •   మునిప‌ల్లి ఎస్సీ హాస్ట‌ల్‎ను త‌నిఖీ చేసిన చైర్మ‌న్, మండ‌ల ప్ర‌త్యేకాధికారి   •   పదవులు నా వెంట రావాలి.. భవిష్యత్ సీఎం నేనే!   •  

రాజన్న క్షేత్రం.. భక్తజన సంద్రం

10-06-2024 | 10:29am

వేములవాడ లో పోటెత్తిన భక్తులు

రాజన్న సిరిసిల్ల, విజయక్రాంతి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి సోమవారం దర్శనానికి పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి ఆలయానికి చేరుకున్న భక్తులతో పరిసరాలన్నీ సందడిగా మారాయి. ధర్మగుండంలో స్నానాలు చేసిన భక్తులు తెల్లవారుజాము నుండి స్వామివారిని దర్శించుకునేందుకు క్యూ లైన్లలో బారులు తీరారు. గర్భాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కోడెమొక్కులు చెల్లించుకున్నారు. స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులకు ఏడు గంటల సమయం పట్టింది. ప్రాంగణంలోని  పరివార దేవతలకు ప్రత్యేక పూజలు చేశారు. కళాభవన్ లో జరిగిన సత్యనారాయణ స్వామి వ్రతాలు స్వామివారి నిత్య కళ్యాణాల్లో భక్తులు పాల్గొన్నారు. పట్టణంలోని శ్రీ భీమేశ్వర ఆలయం బద్దిపోచమ్మ ఆలయాల్లో భక్తుల సందడి నెలకొంది.