10 May, 2026 | 5:48 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి.. మరోకరికి తీవ్ర గాయాలు

27-11-2024 02:47 PM

కోదాడ,(విజయక్రాంతి): కోదాడ మండలం చిమిర్యాల వద్ద 65వ నెంబర్ జాతీయ రహదారిపై బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరోకరి గాయాలయ్యాయి. వివరాలోకి వెళితే... సూర్యాపేట జిల్లా, అనంతగిరి మండలం గోండ్రియాల గ్రామానికి చెందిన తాళ్లూరి శేషయ్య(62), ముదిగొండ చెందిన పిల్లుట్ల జయమ్మ (54) రోడ్డు పక్కన నిల్చున్నారు.

హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న మహేంద్ర కారు (టీఎస్09జిఏ2142) అతి వేగంగా దూసుకు వచ్చి వీరి ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో తాళ్లూరి శేషయ్య అక్కడికక్కడే మృతి చెందగా, పిల్లుట్ల జయమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. అది గమనించిన స్థానికులు క్షతగాత్రురాలిని  చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవ పరీక్ష నిమిత్తం మార్చురికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.