రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం... 9 మంది దుర్మరణం
01-07-2024 07:02 PM
దుండాపూర్ : రాజస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కరౌలి జిల్లాలోని దుండాపూర్ సమీపంలో లారీ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 9 మంది ప్రాణాలు కోల్పోగా. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో గాయపడిని వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు.






