18 July, 2026 | 2:00 PM

రాష్ట్రంలో 8 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ

01-07-2024 06:07 PM

హైదరాబాద్ : రాష్ట్రంలో 8 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సోమవారం ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ సలహాదారుగా రిటైర్డ్ ఐఏఎస్ కె. ఎస్. శ్రీనివాస రాజు, మౌలిక వసతులు, ప్రాజెక్టుల సలహాదారుగా నియమించారు. 

ఐపీఎస్‌ల బదిలీలు

కొత్తగూడెం ఓఎస్డీగా పరితోష్ పంకజ్, ములుగు ఓఎస్ డీగా గీతే మహేష్ బాబాసాహెబ్,  సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీగా పాటిల్ కాంతిలాల్ సుభాష్, గవర్నర్ ఏడీసీగా ఉన్న సిరిశెట్టి సంకీర్త్ అదే హోదాలో ఇక నుంచి  ఓఎస్డీగా వ్యవహరించనున్నారు. వేములవాడ ఏఎస్పీగా శేషాద్రిని రెడ్డి, భద్రాచలం ఏఎస్పీగా అంకీత్ కుమార్, ఏటూరు నాగారం ఏఎస్పీగా శివం ఉపాధ్యాయ, భైంసా ఏఎస్పీగా అవినాశ్ కుమార్ లను బదిలీ చేశారు.