20-12-2025 12:24:57 PM
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం పీవీ ఎక్స్ ప్రెస్ వేపై(PVNR Expressway) రోడ్డు ప్రమాదం జరిగింది. పిల్లర్ నంబర్ 253 వద్ద మూడు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ప్రమాదంలో పలువురికి గాయాలు కావడంతో తక్షణమే సమీప ఆస్పత్రికి తరలించారు. ఉప్పర్ పల్లి నుంచి ఆరంఘర్ చౌరస్తా(Upparpally to Aramghar Chowrasta) వరకు ట్రాఫిక్ జామ్ అయింది. భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రంగంలోకి దిగిన పోలీసు సిబ్బంది ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.