calender_icon.png 20 December, 2025 | 12:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

16 మంది ఎమ్మెల్యేలపై అసంతృప్తి

20-12-2025 11:47:23 AM

హైదరాబాద్: తెలంగాణలో మూడు విడతల్లో జరిగిన గ్రామ పంచాయతీ(Telangana Gram Panchayat Elections) ఎన్నికలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy ), మీనాక్షి నటరాజన్, మహేష్ గౌడ్ టెలికాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలపై తాము ముగ్గురం చర్చించామని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ వెల్లడించారు. రెబల్స్ ను సమన్వయం చేయలేని ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ ఛార్జీలపై అసహనం వ్యక్తం చేశారు.

పంచాయతీ ఎన్నికల్లో సరిగా పనిచేయని 16 మంది ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రెబల్స్ తో సమన్వయ లోపం, బంధువులను అభ్యర్థులుగా నిలబెట్టడంపై నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫోన్ ద్వారా 16 మంది ఎమ్మెల్యేలు, ఇన్ ఛార్జులతో మహేశ్ గౌడ్(TPCC Chief Mahesh Goud) మాట్లాడారు. పార్టీకి తీరని నష్టం చేశారని పీసీసీ చీఫ్ ఆందోళన వ్యక్తం చేశారు. 16 మంది ఎమ్మెల్యేలు పనితీరుపై సీఎం రేవంత్, మీనాక్షి అసంతృప్తిగా ఉన్నారని మహేశ్ గౌడ్ స్పష్టం చేశారు. వైఖరి మార్చుకుని పార్టీ నియమనిబంధనలకు లోబడి పనిచేయాలని ఆదేశించారు.