అతివేగం.. అజాగ్రత్తతోనే రోడ్డు ప్రమాదాలు
మెదక్ డీఎస్పి ప్రసన్నకుమార్
పాపన్నపేట, ఏప్రిల్13: అతివేగం, అజాగ్రత్త, కాస్త ఏమరపాటు వల్లే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, ఈ ప్రమాదాలలో ముఖ్యంగా యువత ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారని మెదక్ డీఎస్పి ప్రసన్నకుమార్ పేర్కొన్నారు.
రూరల్ సీఐ జార్జ్, తహసీల్దార్ సతీష్, తదితర మండల అధికారులతో కలిసి మండల పరిధిలోని కొత్తపల్లిలో రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీస్, రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా అరైవ్ అలైవ్ కార్యక్రమం ద్వారా వాహనదారులకు, ప్రజలకు రోడ్డు భద్రత నియమాలు, నిబంధనల పై అవగాహన కల్పించారు.
కార్యక్రమానికి మహిళలు, వాహనదారులు భారీ ఎత్తున తరలివచ్చి అవగాహన సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ ప్రసన్నకుమార్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించడం వల్ల ప్రాణాలకు రక్షణ కవచంల ఉంటుందన్నారు. కారులో సీటు బెల్టు ధరించాలన్నారు. పోలీసుల జరిమానా విధిస్తారని హెల్మెట్ ధరించడం కాదు.. మీ ప్రాణాలు కాపాడుకోవడం కోసమన్నారు.
ఎవరికి వాళ్లు స్వతహగా నియమాలు పాటిస్తే రోడ్డు ప్రమాదాలను తగ్గించవచ్చన్నారు. ప్రమాదాలు ఎక్కువగా నిర్లక్ష్యం, అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, సెల్ ఫోన్, మైనర్లు డ్రైవింగ్, ఓవర్ టేకింగ్, టర్నింగ్ పాయింట్ వద్ద క్రాసింగ్ లు చేయడంవల్ల ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీవో వెంకటస్వామి, ఆర్టీసీ డిపో మేనేజర్ సురేఖ, ఆర్ అండ్ బి డీఈ వెంకటేశం, పీఆర్ ఏఈ శ్రీకాంత్, మెడికల్ ఆఫీసర్ ప్రదీప్ రావు, ఎక్సైజ్ సీఐ నాగేశ్వరరావు, స్థానిక ఎస్త్స్ర శ్రీనివాస్ గౌడ్, ఆయా పార్టీల నాయకులు పాల్గొన్నారు.






