14 April, 2026 | 2:29 AM

ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితం, సుఖమయం

14-04-2026 12:38 AM

సత్తుపల్లి ఆర్టీసీ ఆధ్వర్యంలో అరైవ్ ఎలైవ్

సత్తుపల్లి, ఏప్రిల్ 13. ( విజయ క్రాంతి ): రోడ్డు భద్రత ప్రతి ఒక్కరు బాధ్యత అని, భద్రతా నియమాలు పాటిస్తూ ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా నడుచుకున్నట్లయితే ప్రమాదాలను నివారించవచ్చాని సత్తుపల్లి డిపో మేనేజర్ గురిజాల.లక్ష్మీనారాయణ అన్నారు. సోమవారం సత్తుపల్లి డిపోలో ఎరైవ్- ఎలైవ్ ప్రోగ్రాంను స్థానిక ఎంవిఐ రాజశేఖర్ , సబ్ ఇన్స్పెక్టర్ జి అశోక్ ఆధ్వర్యంలో నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడుతూ సురక్షిత ప్రయాణానికి ఆర్టీసీ బస్సులను మాత్రమే ఉపయోగించుకోవాలని ఆర్టీసీ బస్సులలో ప్రయాణం సురక్షితం సుఖమైన శుభప్రదం అని అన్నారు..

ముందుగా సత్తుపల్లి డిపో నుండి ప్ల కార్డులు చేతబూని, రోడ్డు భద్రత స్లొగన్స్ చేస్తూ రింగ్ సెంటర్లో మానవహారం నిర్వహించారు. అనంతరం డిపో గేటు వద్ద ఉద్యోగులతో కలిసి రోడ్డు భద్రత నియమాలను పాటించాలని కోరుతూ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఎస్త్స్ర జి అశోక్,  ఎంవీఐ రాజశేఖర్, ఏఎంవీఐ రాజశేఖర్ రెడ్డి, ఆర్టీసీ అసిస్టెంట్ మేనేజర్  పి.ప్రవీణ్ కుమార్, అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ ఎస్ సాహితి, ఏడీసీలు, సూపర్ వైజర్లు, సిబ్బంది పాల్గొన్నారు.