కోతకు గురైన రోడ్డు.. రాకపోకలకు ఇబ్బంది
06-11-2025 12:00 AM
వెల్దండ, నవంబర్ 4: మండల పరిధిలోని బైరాపూర్ వాగులో నిర్మించిన కల్వర్టు కోతకు గురై రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది. బుధవారం కురిసిన వర్షాలకు వాగు ఉధృతి పెరిగి బైరాపూర్ గ్రామ సమీపంలోని కల్వర్టు వరద ఉధృతికి కోతకు గురైంది. ఇటీవలనే రోడ్డు దెబ్బతిని వాహనాల రాకపోకలు స్తంభించాయి.
గ్రామస్తులు ఇటీవల తాత్కాలిక మరమ్మతులు చేపట్టి రాకపోకలు ఇబ్బంది లేకుండా చేశారు. మంగళ బుధవారం కురిసిన వర్షాలకు వరద ఉధృతి పెరిగి రోడ్డు కోతకు గురైంది. దీంతో వాహనాల రాకపోకలు స్తంభించి ప్రయాణికులు కాలినడకన వెళ్తున్నారు. అధికారులు చొరవ తీసుకొని రోడ్డు మరమ్మతులు చేపట్టి వాహనాల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చేయాలని పలు గ్రామాల ప్రజలు కోరుతున్నారు.






