calender_icon.png 6 November, 2025 | 9:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదలకు సొంతింటి కల నెరవేర్చిన ఘనత కాంగ్రెస్‌ది

06-11-2025 12:00:00 AM

రంగారెడ్డి గూడ గ్రామంలో ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి

రాజాపూర్ నవంబర్ 5:  సొంతింటి లేని పేదలకు ప్రభుత్వ నిధులతో ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని రంగారెడ్డి గూడ గ్రామంలో ఇందిరమ్మ ఇంటిని కలెక్టర్ విజయేంద్రి బోయి తో కలిసి ప్రారంభించారు.

అనంతరం లబ్ధిదారిని ఇంటిలో అధికారులతో కలసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టిఆర్‌ఎస్ పార్టీ పదేళ్లు అధికారంలో ఉండి ఏ ఒక్క పేద కుటుంబానికి ఇల్లు ఇవ్వలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంబడే పేదలకు సంక్షేమ ఫలాలతో పాటు సొంత ఇంటి కల సహకారం చేశామని అన్నారు.

ఇల్లు లేని అర్హులైన ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు కల్పించడం ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు. ఇందిరమ్మ ఇండ్లు పొందిన లబ్ధిదారులు ఎవ్వరికి ఎటువంటి రూపాయి ఖర్చు లేకుండా ఇందిర మ్మ ఇండ్ల బిల్లును లబ్ధిదారుని ఖాతాలో చమచేస్తున్నామని తెలిపారు. అనంతరం రంగారెడ్డి గూడ గ్రామంలో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై ఎమ్మెల్యే, కలెక్టర్  సమీక్షా చేశారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ అశ్విని,వైస్ చైర్మన్ శేఖర్ గౌడ్ , మాజీ సర్పంచ్ శశికళ రెడ్డి,మాజీ ఎంపీటీసీ సునీత శ్రీనివాస్ నాయక్, తాసిల్దార్ రాధాకృష్ణ,ఎంపీడీవో విజయలక్ష్మి,ఎం పి ఓ వెంకట్ రాములు, అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.