రోడ్డు భద్రత అందరి భాద్యత
నాగర్ కర్నూల్ ఏప్రిల్ 15 విజయక్రాంతి : రోడ్డు భద్రత నియమాలు పాటించాల్సిన బాధ్యత అందరిపై ఉన్నదని జిల్లా అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు బుధవారం జిల్లా కేంద్రంలోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు అరైవ్‌అలైవ్ రోడ్డు భద్రతపై నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి హాజరయ్యారు. దేశంలో సగటున ప్రతి నాలుగు నిమిషాలకు ఒక రోడ్డు ప్రమాదం జరుగుతోందని వీటిలో ఎక్కువ శాతం యువతే మృతి చెందుతున్నారని పేర్కొన్నారు. అందువల్ల ప్రతి ఒక్కరూ బాధ్యతగా రోడ్డు భద్ర తా నియమాలను పాటించాలని సూచించారు.
వాహనం నడిపే ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ఫోన్ మాట్లాడుతూ, మద్యం సేవించి, రాంగ్ రూట్లో, అతివేగంగా లేదా నిర్లక్ష్యంగా వాహనం నడపకూడదని హెచ్చరించారు. వాహనం నడిపేటప్పుడు జరిగే ప్ర మాదాలు కుటుంబాలకు తీరని బాధను మిగులుస్తాయన్నారు. అనంతరం అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో డీఈఓ రమేష్ కుమార్, ఎంఈఓ కురుమయ్య, ఆర్టీవో అధికారి రమేష్, నాగర్ కర్నూల్ ఎస్త్స్ర గోవర్ధన్, ట్రాఫిక్ ఆర్‌ఎస్‌ఐ కళ్యాణ్ పాల్గొన్నారు.






