13 April, 2026 | 5:39 PM

ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుతోనే అభివృద్ధి

13-04-2026 04:31 PM

తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు

రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని కోరుతూ ప్రతిజ్ఞ

తుంగతుర్తి,(విజయక్రాంతి): ప్రభుత్వ కార్యాలయకు నూతన బిల్డింగ్ నిర్మాణంతోనే మండలాలు ఎంతగానో అభివృద్ధి చెందుతాయని, రోడ్డు భద్రత నియమాలను ప్రతి ఒక్కరు పాటించాలని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు. సోమవారం నాగారం మండల కేంద్రంలోని నాగారం బంగ్లా ఆవరణలో నూతనంగా తాసిల్దార్ ఎంపీడీవో కార్యాలయాల నిర్మాణాలకు సుమారు 11.25 లక్షల వ్యయంతో భూమి పూజ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గత తొమ్మిది సంవత్సరాలు పాలించిన బిఆర్ఎస్ మాజీమంత్రి జగదీష్ రెడ్డి పాలనలో, ప్రభుత్వ కార్యాలయాలు చేపట్టకపోవడం దురదృష్టకరమైన విషయం అని అన్నారు.

మండలాల అభివృద్ధి చెందాలంటే ప్రతి మండలంలో ప్రభుత్వ కార్యాలయాలు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా నిర్మాణం చేపట్టాలని ఉద్దేశంతోనే, నాగారం బంగ్లాలో నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్టు తెలిపారు. రానున్న రోజుల్లో ఎస్సారెస్పీ కాలువ నిర్మాణానికి, జిల్లా మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి సహకారంతో ప్రత్యేక నిధులు మంజూరు చేయించి, పనులు చేయిస్తానని హామీ ఇచ్చారు. రెండు సంవత్సరాల పాలలో సుమారు 2000 కోట్ల నిధులతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నట్లు తెలిపారు. తిరుమలగిరి ప్రాంతంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటుకు తాను ముఖ్యమంత్రితో పలు దాపాలుగా చర్చించి నేడు కాలేజీ ప్రారంభించడంతో సుమారు 200 మంది పేద విద్యార్థులకు అవకాశం కలిగిందని తెలిపారు.

ఎస్సారెస్పీ కాలవదార నేడు పంట పొలాలకు సాగునీరు అందించి, రైతు అధికంగా పంటలు పండించడానికి కృషి చేస్తున్నట్టు తెలిపారు. రుద్రమ్మ చెరువులోకి ఎస్సారెస్పీ నీళ్లు వచ్చే విధంగా, ప్రత్యేక ప్యాకేజీని మంత్రితో చర్చించనున్నట్లు తెలిపారు. తిరుమలగిరి ఇంటిగ్రేటెడ్ గురుకులం పాఠశాల నిర్మాణానికి సుమారు రెండు వందల కోట్ల నిధులతో పనులు సాగుతున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో ఏ అవకాశం వచ్చినా తాను అభివృద్ధి చేయుటకు కృషి చేస్తానని రానున్న స్థానిక ఎన్నికల్లో ఐకమత్యంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు పనిచేసే, గెలుపు దిశగా పయనించాలని కోరారు.

అనంతరం సంబంధిత కాంట్రాక్టర్ యశ్వంత్ రెడ్డి తో మాట్లాడి, బిల్డింగ్ నిర్మాణ పనులు వేగవంతంగా జరిగే విధంగా చేయాలని కోరారు. అంతరం ప్రజాపాలన 99 రోజులలో భాగంగా డీఎస్పీ ప్రసన్నకుమార్ భద్రతా నియమాలపై వాన దారులకు, ప్రజలకు ప్రత్యేకంగా తెలియపరచి ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు చెవిటి వెంకన్న యాదవ్, స్థానిక సర్పంచ్ సుజాత వెంకన్న, ఆర్డిఓ వేణుగోపాల్, తాసిల్దార్ దేవేంద్ర ప్రసాద్ ఎంపీడీవో భీమ్ సింగ్ నాయక్, నాగారం మండల పార్టీ అధ్యక్షులు తోడుసు లింగయ్య యాదవ్, అధికారులు, వివిధ గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.