15 April, 2026 | 4:18 AM

రోడ్డు భద్రతపై విస్తృత ప్రచారం చేయాలి

02-01-2026 01:03 AM

జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి 

రంగారెడ్డి జనవరి 1 (విజయక్రాంతి): రోడ్డు ప్రమాదాలు భద్రతపై అధికారులు విస్తృతంగా ప్రజలకు అవగాహన కల్పించి రోడ్డు ప్రమాదాలను తగ్గించేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో జనవరి 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు నిర్వహించే రోడ్డు భద్రత మాస వేడుకలకు సంబంధించిన రోడ్డు భద్రతపై కరపత్రాలు మరియు బ్రోచర్లను జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి విడుదల చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల వల్ల బాధిత కుటుంబాలు రోడ్డున పడతాయని, రోడ్డు నియమ నిబంధనలు పాటించి వాహనాలు నడిపితే ప్రమాదాలు తగ్గించవచ్చని అందుకు సంబంధించిన అధికారులు వాహనాదార్లకు పలు సలహలు, సూచనలు చేసి అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. రోడ్డు భద్రత మాస  ఉత్సవాల్లో భాగంగా జనవరి నెల మొత్తం జిల్లాలో రోడ్డు భద్రతా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు కలెక్టర్ కు వివరించారు.ఈ రోడ్ భద్రత కార్యక్రమాలలో రవాణా శాఖ ఆర్టీఏ - డీటీసీ, ఎంవీఐలు మరియు ఏఎంవీఐలు, ఈఈ ఆర్&బీ బృందంతో పాటు,  పోలీస్ శాఖ -డీసీపీ మహేశ్వరం, సీఐ ట్రాఫిక్ ఐబీపీఎం బృందం పాల్గొంటారని అధికారులు పేర్కొన్నారు.