02-01-2026 01:03:04 AM
బీఆర్‌ఎస్ పార్టీ కార్యనిర్వహక అధ్యక్షులు కేటీఆర్ సమక్షంలో చేరిక
మహబూబ్‌నగర్, జనవరి 1: మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం ప్రేమ్ నగర్ కు చెందిన మాజీ కౌన్సిలర్ కిషోర్ కుమార్ బీఆర్‌ఎస్ పార్టీ కార్యనిర్వహక అధ్యక్షులు కేటీఆర్, మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో బీజేపీ పార్టీ నుండి బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. అయన తో పాటు వివిధ పార్టీల నుండి కిరణ్, రాజేష్, శ్రీనివాస్ రెడ్డి, సుమన్, నర్సింహ, గఫర్, సమీర్, విష్ణు, వినయ్, హైదర్, రాజు, అనిల్ మరియు తదితరులు బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు.
పురపాలిక ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థుల గెలుపుకు సమిష్టిగా అందరు కలిసి పనిచేయాలని కేటీఆర్ సూచించారు. మహబూబ్ నగర్ పురపాలికలో మరోమారు గులాబీ జెండా ఎగారావేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో మూడా మాజీ చైర్మన్ గంజి వెంకన్న, మున్సిపల్ మాజీ చైర్మన్ కేసి నర్సింహులు, పార్టీ పట్టణ అధ్యక్షులు శివరాజు, మాజీ వైస్ చైర్మన్ తాటి గణేష్, మాజీ కౌన్సిలర్లు మూస నరేందర్, రామ్ లక్ష్మణ్, ప్రభాకర్, ఆంజనేయులు, అల్తాఫ్ హుస్సేన్, పూర్ణచందర్, తదితరులు ఉన్నారు.