రోడ్డు పనులు వేగవంతం చేయాలి
03-06-2024 12:05 AM
ఆదిలాబాద్, జూన్ 2 (విజయ క్రాంతి): ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని బోరజ్ నుంచి బేల మండల సరిహద్దుల్లోని మహారాష్ర్ట వరకు చేపడుతున్న నేషనల్ హైవే రోడ్డు నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కోరారు. జైనథ్ మండలం తరోడా బ్రిడ్జి వద్ద రోడ్డు నిర్మాణ సరే పనులను ఆదివారం ఎమ్మెల్యే పరిశీలించారు. తరోడ బ్రిడ్జిపై నీటి సరఫరా లైన్ ఉండటంతోపాటు ఎన్నికల కోడ్ కారణంగా పనుల్లో ఆలస్యం అవుతోందని అధికారులు ఎమ్మెల్యేకు వివరించారు. వర్షాకాలంలో రాకపోకలు కొనసాగే విధంగా తరోడ బ్రిడ్జి పక్క నుంచి మూడు కోట్ల నిధుల వ్యయంతో డైవరన్ ఏర్పాటుకు కేంద్రానికి ప్రపోజల్ పంపుతామని ఎమ్మెల్యే తెలిపారు.






