కిన్నెరసానిలోదూకిన మహిళ
03-06-2024 12:05 AM
కాపాడిన టూరిజం సిబ్బంది
భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 2 (విజయక్రాంతి): కుటుంబ కలహాలతో ఓ మహిళా కిన్నెరసాని ప్రాజెక్టులో దూకి ఆత్మహత్యకు యత్నించింది. అక్కడే ఉన్న టూరిజం సిబ్బంది గమనించి కాపాడటంతో ప్రాణాలతో బయటపడింది. వివరాల్లోకి వెళ్తే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవీపల్లి మండలం సంజయ్‌నగర్‌కు చెందిన సరిత కుటుంబ కలహాల నేపథ్యంలో ఆదివారం పాల్వంచ మండల పరిధిలోని కిన్నెర సాని ప్రాజెక్టులో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆ సమయంలో అక్కడే ఉన్న టూరిజం సిబ్బంది అప్రమత్తమై ఆమెను రక్షించారు. అనంతరం పాల్వంచ రూరల్ పోలీసులు ఆమెకు కౌన్సెలింగ్ నిర్వహించి, కుటుంబ సభ్యులకు అప్పగించారు.






