05-07-2025 12:16:00 AM
మరమ్మతులు చేయని అధికారులు
మేడ్చల్ అర్బన్, జూలై 4: మేడ్చల్ ప ట్టణంలో రోడ్లు అధ్వానంగా తయారయ్యా యి. అడుగు అడుగున గుంతల రోడ్లతో ప ట్టణ ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చెక్ పోస్టు నుం చి కిష్టాపూర్, కేఎల్‌ఆర్ కు వెళ్లే శివాలయం, కోర్టు రోడ్లు, బస్ డిపో నుంచి కిష్టాపూర్ వెళ్లే రోడ్డు పూర్తిగా గుంతల మయంగా తయారయ్యాయి. ఒకవైపు గుంతలు, మరోవైపు స్పీ డ్ బ్రేకర్లతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఈ రోడ్లపై వెళ్లాలంటేనే వాహన దారులు భయపడుతున్నారు.
రోడ్లమీద గుంతలతో ప్రమాదాలు.
రోడ్లమీద పెద్ద పెద్ద గుంతలు ఏర్పడడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని పలువురు స్థానికులు చెబుతున్నారు. వర్షం కురిసినప్పుడు గుంతలో నీళ్లు చేరడం వల్ల గుంత కనబడకపోవడంతో ద్విచక్ర వాహనాలు అదుపుతప్పి పలు సందర్భాల్లో ప్ర మాదాల బారిన పడుతున్నారు.
నాసిరకంగా రోడ్ల నిర్మాణం
రోడ్ల నిర్మాణ సమయంలో రోడ్ల నిర్మాణానికి టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు సరైన మెటీరియల్ వాడకుండా, నాసిరకంగా తారు, సిమెంటు రోడ్లను వేశారని ప లువురు స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. రో డ్ల నిర్మాణం అనంతరం నాణ్యత ప్రమాణికాలను పరీక్షించాల్సిన అధికారులు రోడ్డు ని ర్మాణానికి సంబంధించిన నాణ్యతను పరిశీలించకపోవడం వల్లే రోడ్లు ఈ స్థితికి వస్తు న్నాయని స్థానిక పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు. రోడ్లు అద్వాన్నంగా తయారైనప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా అధికారులు మరమ్మతులు చేపట్టాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
గుంతల రోడ్లతో వెన్నునొప్పి వస్తుంది
గుంతల రోడ్లమీద ప్రయాణిస్తే వెన్నునొప్పి వస్తోంది. రోడ్లకు మరమ్మ తులు చేయాల్సిన అధికారులు ఏం పట్టన ట్లుగా వ్యవహరిస్తున్నారు. నిత్యం రోడ్లపై ప్రయాణించే మున్సిపాలిటీ అధికారుల కు ఈ గుంతలు కనిపించడం లేదా. వెంటనే రోడ్లకు మరమ్మతులు చేయాలి.
కానుకంటి వంశీ విజయ్