05-07-2025 12:14:21 AM
మణికొండ, జూలై 4: రహదారుల సమీపంలో ఉన్న ఫుట్ పా తులను కొందరు ఆక్రమించి వ్యాపారం చేయ డంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడి స్థానికులు ఇ బ్బందులు పడుతున్నారంటూ ఇటీవల విజయక్రాంతిలో ప్రచురించిన వరుస కథనాలకు అధికారులు స్పందించారు. రోడ్ల పైన ఆక్రమించిన ఫుట్పాతులను తొలగించేందుకు అధికారులు రంగం సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు.
మణికొండ మున్సిపాలిటీలో ప్రధానంగా హరివిల్లు రోడ్డు నుంచి తారా కిచెన్స్ వరకు ఆక్రమణలపై సవివరంగా సమస్యను కళ్ళకు కట్టే లా వార్తలు ప్రచురితమయ్యాయి. విజయ కాంతులు ప్రచురితమైన కథనాలను స్థానికులు కూడా స్పందించి అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో మున్సిపల్, రెవెన్యూ అధికారులు స్పందించారు. హరివిల్లు రోడ్డు నుంచి తారా కిచెన్స్ వరకు ఆక్రమణలు తొలగించాలని సదరు వ్యక్తులకు ఇప్పటికే అధికారులు నోటీసులు జారీ చేశారు.
అక్రమ డబ్బాలు, నిర్మాణాల తొలగింపునకు మున్సిపల్ కమిషనర్ టెండర్స్ పిలవగా, కాంట్రాక్టర్లు ఎవరూ ఆసక్తి చూపలేదు. మ రోసారి టెండర్స్ పిలుస్తామని అధికారులు చెబుతున్నారు. ముందుగా డబ్బాల తొలగించేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టారు. క్రమంగా ఫుట్ పాత్‌లపై ఉన్న అక్రమ నిర్మాణాలను లేకుండా చేస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో స్థానికులు హార్షం వెల్లిబుచు తున్నారు.