26 June, 2026 | 6:47 PM

Breaking News

ఐకేపీ వీఓఏలను సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలి   •   టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా ఆరెపల్లి రాహుల్   •   నిర్మల్ పోలీస్... మీ పోలీస్...   •   బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా రాపాక ప్రవీణ్ నియామకం   •   డబుల్ లైన్ రోడ్ నిర్మాణ పనులను ప్రారంభించిన చైర్మన్ బిరుదు రాధాకృష్ణ   •   సుల్తానాబాద్ లో వైభవంగా మొహరం వేడుకలు   •   ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదు: కాంగ్రెస్ హెచ్చరిక   •   యూరియా యాప్ రద్దు చేసి రైతులకు నేరుగా పంపిణీ చేయాలి   •   హరీష్ రావుకు ఆహ్వాన పత్రిక అందజేత   •   టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్.. వైభవ్‌కు దక్కని చోటు   •  

Banswadaలో ఉద్రిక్తతల తర్వాత బంద్: 144 సెక్షన్ అమలు, కట్టుదిట్టమైన భద్రత

21-02-2026 10:57 AM
  1. 144 సెక్షన్ అమలు
  2. 200 పోలీసు బలగాలతో భారీ బందోబస్తు
  3. స్వచ్ఛందంగా మూసి ఉంచిన దుకాణాలు

బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) బాన్సువాడ డివిజన్ కేంద్రంలో శనివారం ప్రశాంతంగా బంద్(Banswada Bandh) కొనసాగుతుంది. శుక్రవారం సాయంత్రం రిలయన్స్ మాట్ షో రూమ్ లో పనిచేస్తున్న ఓ మహిళ పట్ల ఓ వ్యక్తి అసభ్యంగా మాట్లాడారని ఫిర్యాదు చేయడంతో హిందూ సంఘాలు ధర్నా రాస్తారోకో చేపట్టారు. మరో వర్గం రాళ్లతో దాడి చేయడంతో ఇరువర్గాలు ఆందోళనకు దిగారు. దీంతో ఎస్పీ రాజేష్ చంద్ర బాన్సువాడ కు చేరుకొని ఇరువర్గాలను శాంతింపజేసి ఆందోళనను విరమింప చేశారు. దీంతో శనివారం హిందూ సంఘాలు బీజేపీ ఆధ్వర్యంలో బంద్ కు పిలుపునిచ్చారు.

తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన తాజా వార్తలు ఇక్కడ చదవండి.

వ్యాపారస్తులు(business people) ప్రజలు స్వచ్ఛందంగా బందులో పాల్గొన్నారు. ముగ్గురు డీఎస్పీలు 20 మంది సిఐలు 30 మంది ఎస్ఐలు 200 మంది పోలీస్ బలగాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పట్టణంలో పికెట్ ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. 144 సెక్షన్ అమలు చేశారు. బాన్సువాడ డీఎస్పి విట్టల్ రెడ్డి పట్టణ సీఐ తూల శ్రీధర్ రూరల్ సీఐ తిరుపతయ్యలు ఎప్పటికప్పుడు పెట్రోలింగ్ నిర్వహిస్తూ పర్యవేక్షిస్తున్నారు.