calender_icon.png 21 February, 2026 | 12:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈనెల 26న పెండ్లి.. ప్రమాదవశాత్తు దగ్ధమైన గుడిసె

21-02-2026 10:25:29 AM

అగ్నికి ఆహుతైన పెళ్లికి సంబంధించిన బంగారు ఆభరణాలు, వస్త్రాలు, వస్తువులు, నగదు.

తుంగతుర్తి,(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం మంచ్యాతండాలో ప్రమాదవశాత్తు గుడిసె దగ్ధమైన ఘటన శుక్రవారం రాత్రి జరిగింది. తండాకి చెందిన లాకావత్ అమ్ము కుమారుడు లాకావత్ సోమన్న వివాహం ఈనెల 26న జరగనుంది. గుడిసె దగ్ధం కావడంతో  పెండ్లికి సంబంధించిన బంగారు ఆభరణాలు, వస్త్రాలు, వస్తువులతో పాటు రూ.2 లక్షలు దగ్ధమయ్యాయి. ఈ ఘటన షార్ట్  సర్క్యూట లేదా ఏ విధంగా జరిగిందో తెలియక బాధితులు కన్నీటి పర్వంతమయ్యారు. సంబంధిత అధికారులు స్పందించే విచారణ జరిపించి, కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.