13 April, 2026 | 2:27 AM

రెనే హాస్పిటల్‌లో రోబోటిక్ మోకాలు కీలు మార్పిడి చికిత్స

13-04-2026 12:46 AM

ప్రారంభించిన బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

కరీంనగర్, ఏప్రిల్ 12 (విజయ క్రాంతి): కరీంనగర్ జిల్లా కేంద్రం లోని రెనే హాస్పిటల్ లో ఉత్తర తెలంగాణలోనే మొట్టమొద టిసారిగా రోబోటిక్ మోకాలు కీలుమార్పిడి చికిత్సను బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు మాజీమంత్రి గంగుల కమలాకర్ తో కలిసి ఆదివారం రోజున ప్రారంభించారు. రెనే హాస్పిటల్లో వాలిస్ కంపెనీకి చెందిన సుమారు ఐదు కో ట్ల విలువ చేసే అత్యాధునిక రోబోటిక్ సర్జరీ యంత్రాన్ని ప్రారంభించారు.

అనంతరం లక్కీ డ్రా ద్వారా 15 మంది ఉచిత కీలు మా ర్పిడికి ఎంపిక చేశారు. ఈ సందర్భంగా కె టిఆర్ మాట్లాడుతూ ఇలాంటి అత్యాధునిక వైద్య సదుపాయాలను జిల్లా కేంద్రాల్లో కూ డా అందుబాటులోకి రావడం శుభ పరిణా మం అన్నారు. రెనే హాస్పిటల్ చైర్మన్ ప్రొఫెసర్ డాక్టర్ బంగారి స్వామి, డాక్టర్ రజనీ ప్రియదర్శినిలను అభినందించారు. చైర్మన్ డాక్టర్ బంగారి స్వామి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తన తల్లిదండ్రులు బంగారి లక్ష్మి-మైసయ్య పేరుపై సుమారు యాభై లక్షల రూపాయల విలువగల సర్జరీలను తను, తన సతీమణి డాక్టర్ రజని ప్రియదర్శిని ఉచితంగా చేయడం జరుగుతుందన్నారు. తను ఈ వైద్య రంగంలో ఉన్నన్ని రోజులు ఇ లాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తమ కుటుంబం అంతా వైద్య సేవకే అంకి తం అని అన్నారు. 

ఈ కార్యక్రమంలో మేయ ర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సు నీల్ రావు, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, బిఆర్‌ఎస్ జిల్లా జి వి రామకృష్ణా రావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రా వు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, గ్రంధాలయ సంస్థ మాజీ అధ్యక్షులు పొన్నం అనిల్ గౌడ్, ఏనుగు రవీందర్ రెడ్డి, రఘువీర్ సింగ్, మాజీ మున్సిపల్ మేయర్ రవీందర్ సింగ్, మాజీ సుడా డైరెక్టర్ నేతి రవి వర్మ, కార్పొరేటర్లు సరిల్ల రాజ కుమారి ప్రసాద్, సోమిడి వేణు,  తదితరులు పాల్గొన్నారు.