2 May, 2026 | 10:29 AM

నగరాభివృద్ధికి పక్క ప్రణాళికలు

02-05-2026 09:29 AM

- రూ 50 లక్షల వ్యయంతో ఎంవిఎస్ డిగ్రీ కళాశాల మైదానంలో వాకింగ్ ట్రాక్ నిర్మాణానికి శంకుస్థాపన 

- మిని స్టేడియం లో  లైబ్రరీ ఏర్పాటు చేస్తాం 

- చెప్పేదికాదు చేసి చూపిస్తున్నాం  :

ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి 

మహబూబ్ నగర్ (విజయ క్రాంతి) : నగర అభివృద్ధికి పక్క ప్రణాళికలు వేసుకుంటూ అడుగులు వేస్తున్నామని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం ముడా నిధులు రూ 50 లక్షలతో ఎంవీఎస్ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్మించనున్న వాకింగ్ ట్రాక్‌ నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా  ఎమ్మెల్యే మాట్లాడుతూ నగరం లో నీటి సరఫరా, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థల అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు.  సీసీ రోడ్లు, డ్రైన్స్, ఛానెల్ కాలువల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతూ పూర్తికి చేరుకుంటున్నాయని వివరించారు.  పట్టణ సుందరీకరణలో భాగంగా వివిధ ప్రాంతాల్లో పార్కులను అభివృద్ధి చేసినట్లు, ముఖ్యంగా మూడా ఆధ్వర్యంలో అనేక పార్కులను అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు.

ఎంవీఎస్ డిగ్రీ కాలేజ్ సమీపంలో ఉన్న విస్తీర్ణ ప్రదేశాన్ని అభివృద్ధి చేసి వాకర్స్ కోసం ప్రత్యేకంగా వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ ప్రాంతానికి వేలాది మంది వాకర్స్ వస్తుండటంతో వారి అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూ 50 లక్షల వ్యయంతో వాకింగ్ ట్రాక్, లైటింగ్ సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ పనులు  తక్కువ సమయం లో పూర్తి చేసి  ప్రజలకు అందుబాటులోకి రానున్నాయని, చుట్టుపక్కల కాలనీల ప్రజలకు ఇది ఎంతో ఉపయోగకరంగా మారుతుందని తెలిపారు. పట్టణంలో ఎక్కడ ప్రభుత్వ స్థలాలు అందుబాటులో ఉన్నాయో అక్కడ పార్కులు, ఓపెన్ జిమ్‌లు, మహిళా జిమ్‌లు ఏర్పాటు చేసి ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పార్కుల అభివృద్ధి చేపట్టి ప్రజల వినియోగానికి అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు.

అనంతరం ఎంవిఎస్ డిగ్రీ కళాశాల మైదానం ప్రాంగణంలో ఉన్న మినీ స్టేడియాన్ని పరిశీలించిన అనంతరం అక్కడి నిరూపయోగంగా ఉన్న గదులను చూసి విస్తుపోయారు.   వాటిని ఉపయోగంలోకి తెచ్చేందుకు మినీ స్టేడియంలో అధునాతన హంగులతో సరికొత్త లైబ్రరీ అందుబాటులోకి తెచ్చేందుకు ఎస్టిమేట్ తయారు చేయాలని  ముండా చైర్మన్ కు ఆదేశాలు జారీ చేశారు.  ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, నగర మేయర్ గుమ్మాల మమత శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వినోద్ కుమార్,  సిరాజ్ ఖాద్రీ, కార్పొరేటర్లు సువర్ణ కిషన్ నాయక్, రమేష్ రెడ్డి, రాధా గోవర్థన్ గౌడ్, తాహేర్, నాయకులు చలువగాలి శ్రీనివాస్, ఫోతన్‌పల్లి మోహన్ రెడ్డి, పీర్ మహ్మద్ సాదిక్, సయ్యద్ ముస్తాక్ అలీ తదితరులు పాల్గొన్నారు.